Samsung కొత్త ఫోన్ Galaxy F36 5G పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale భారీ ఆఫర్లు అందుకోండి.!

Updated on 02-Aug-2025
HIGHLIGHTS

Galaxy F36 5G పై రోజు ఫ్లిప్ కార్ట్ Freedom Sale నుంచి భారీ ఆఫర్లు అందించింది

Samsung లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ Galaxy F36 5G

సేల్ నుంచి దాదాపు 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుని కేవలం బడ్జెట్ ధరలో లభిస్తుంది

Samsung ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ Galaxy F36 5G పై రోజు ఫ్లిప్ కార్ట్ Freedom Sale నుంచి భారీ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ గా లాంచ్ అయింది మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుని కేవలం బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ గురించి వివరంగా చూద్దామా.

Samsung Galaxy F36 5G : Freedom Sale ఆఫర్లు

ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఇదే నెలలో విడుదల చేయబడింది ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఈ ఫోన్ పై గొప్ప ఎక్స్ చేంజ్ తో పాటు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 17,499 ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ మరియు రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 14,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1,000 లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ రెడ్ మరియు వయోలెట్ మూడు రంగులో కూడా లభిస్తుంది.

Also Read: National Film Awards 2025 కైవసం చేసుకున్న సినిమాలు ఇవే.!

Samsung Galaxy F36 5G : ఫీచర్లు

శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ మరియు HD గేమింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క సొంత Exynos 1380 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 6 జీబీ / 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో, 50MP + 8MP + 2MP కెమెరాలు ఉంటాయి మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్లు మరియు ఎడిటింగ్ టూల్స్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ టెక్స్చర్ తో గొప్ప లుక్స్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :