Samsung Galaxy F17 5G launched with gorilla glass Victus like premium features
Samsung Galaxy F17 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ వంటి భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రాకతో గెలాక్సీ F సిరీస్ మరింత విస్తరించింది. శామ్సంగ్ సరికొత్తగా ఈరోజే విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 స్మార్ట్ ఫోన్ ను మూడు ఆప్షన్ లతో అందించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరల లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (4GB + 128GB) ధర : రూ. 13,999
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (6GB + 128GB) ధర : రూ. 15,499
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 (8GB + 128GB) ధర : రూ. 16,999
ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి లాంచ్ డీల్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను UPI లేదా బ్యాంక్ పేమెంట్ ద్వారా తీసుకునే వారికి రూ. 500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్, Samsung అఫీషియల్ సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ వయోలెట్ పాప్ మరియు నియో బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.
Also Read: Amazon GIF Sale: కేవలం రూ. 2,949 ఆఫర్ ధరలో Amazon Echo Pop స్మార్ట్ స్పీకర్ అందుకోండి.!
ఈ శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ Super AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ పటిష్టమైన గొరిల్లా గ్లాస్ రక్షణతో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 స్మార్ట్ ఫోన్ Exynos 1330 5G చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
కెమెరా పరంగా, ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Gemini Live, సర్కిల్ టు సెర్చ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల OS మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని ప్రామిస్ చేసింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.