శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదకానుంది.

HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ముందుగా, ఏప్రిల్ నెలలో థాయిలాండ్ లో ప్రారంభించబడింది.

ఈ తాజా స్మార్ట్ఫోన్ ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్ (తిప్పగలిగే) చేయగలిగేలా ఉండే ట్రిపుల్ కెమేరా సేటప్పుతో ఉంటుంది.

గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ జూన్ 15 న భారతదేశం లో రూ 39,990 (~ $ 575) యొక్క ప్రారంభ ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదకానుంది.

ముందుగా, గెలాక్సీ A సిరీస్ నుండి A10, A30, A50 మరియు A70 వంటి స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన శామ్సంగ్ సంస్థ, ఇప్పుడు గెలాక్సీ A80 స్మార్ట్ ఫోనుతో కొత్త కెమెరా ఫీచరును తీసుకొచ్చింది. ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్  (తిప్పగలిగే) చేయగలిగేలా ఉండే ట్రిపుల్ కెమేరా సేటప్పుతో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ అయినటువంటి,శామ్సంగ్ గెలాక్సీ A80 ను ఇప్పుడు ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ముందుగా, ఏప్రిల్ నెలలో థాయిలాండ్ లో ప్రారంభించబడింది, ఈ తాజా స్మార్ట్ఫోన్ ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్  (తిప్పగలిగే) చేయగలిగేలా ఉండే ట్రిపుల్ కెమేరా సేటప్పుతో ఉంటుంది. థాయిలాండ్ లో ఈ ఫోన్ను ప్రారంభించిన తర్వాత, మే నెలలో దీన్ని ఇండియాలో విడుదల చేయనునట్లు శామ్సంగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధృవీకరించారు. అయితే 91mobiles నివేదిక ప్రకారం, గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ జూన్ 15 న భారతదేశం లో రూ 39,990 (~ $ 575) యొక్క ప్రారంభ ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ A80 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్  20: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎటువంటి నోచ్ లేకుండా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు దాదాపుగా అంచులు లేకుండా, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 p రిజల్యూషను మరియు వీనుల విందైన VIVID మరియు బ్రిట్నెస్ అందిస్తుంది. ఇది తాజాగా క్వాల్కమ్ ప్రకటించినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G  SoC తో నడుస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకునేలా ఎటువంటి ఎంపికను అందించలేదు. అలాగే, ఇది ఒక 3,700        

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమెరా f / 2.0 ఎపర్చరు జతగా 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల ఒక వైడ్ యాంగిల్ కెమేరా మరియు ఒక ToF కెమేరాని కలగలిపిన ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక్కడ ఆశర్యపరిచే విష్యం ఏమిటంటే, ఈ కెమేరాని ముందు భాగంలో సెల్ఫీగా మరియు వెనుక కెమెరాలగా కూడా వాడుకునేలా రోటేటింగ్ ఎంపికతో అందించింది. రివ్యూ యూనిట్లో మాత్రం SonyIMX586 సెన్సారుతో అందించింది. అయితే, ఫోన్ అమ్మకానికి వచ్చే సమయానికి తన సొంత సెన్సారును తీసుకువస్తుందో లేదో అనే విష్యం పైన ఎటువంటి సమాచారం లేదు. ఇక ఈ 48MP కెమేరా విషయానికి వస్తే, ఇది డిఫాల్ట్ గా రెడ్మి  నోట్ 7 ప్రో మాదిరిగా బిన్నింగ్ పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. అయితే, ఈ ఫోనులో అందించిన ఒక ప్రో మోడ్ ద్వారా చాలా వేగంగా 48MP రిజల్యూషన్ ఫోటోలకు మారవచ్చు.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile