Samsung ప్రీమియం మెటల్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ చూడచక్కని డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో 40 వేల ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం 23 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేసిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung ప్రీమియం డీల్ ఏమిటి?
శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ నుంచి గత సంవత్సరం మార్చి నెలలో రూ. 39,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసిన గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన డీల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి 5% క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 22,859 రూపాయల ఆఫర్ ధరలో పొందవచ్చు. Buy From Here
శాంసంగ్ గెలాక్సీ A55 స్మార్ట్ ఫోన్ మెటల్ ఫ్రేమ్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో ముందు మరియు వెనుక కూడా కార్నింగ్ ప్రీమియం గ్లాస్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.6 సూపర్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు విజన్ బూస్టర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క 4nm ప్రాసెస్ చిప్ సెట్ Exynos 1480 తో పని చేస్తుంది. జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ (OIS), 12MP అల్ట్రా వైడ్, 5 MP మ్యాక్రో తో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ఫ్రంట్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలు మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో 25 W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగిన 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS తో One UI 6.1 సాఫ్ట్ వేర్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ 4 Android వర్షన్ అప్ డేట్ మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అందుకుంటుంది.