samsung-announced Samsung festive sale special discount price on galaxy phones
Samsung Festive Sale: పండుగ సీజన్ కోలాహలం మొదలయ్యింది. ఇప్పటికే అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వారి పండుగ సీజన్ ప్రకటించగా బ్రాండ్స్ కూడా వారి ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించడం మొదలు పెట్టాయి. 2025 పండుగ సీజన్ సందర్భంగా శాంసంగ్ కూడా ఈరోజు తన పండుగ సేల్ ఆఫర్లు ప్రకటించింది. పండుగ సీజన్ నుంచి ఎన్నడూ చూడని డిస్కౌంట్ ప్రైస్ తో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు ఆఫర్ చేస్తోంది. ఇందులో ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. శాంసంగ్ ప్రకటించిన ఈ పండుగ డీల్స్ పై ఒక లుక్కేయండి.
2025 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా ఈ కొత్త ఆఫర్స్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, శాంసంగ్ ప్రకటించిన కొత్త ఆఫర్ రేట్లు వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇందులో, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE, గెలాక్సీ A55 5G, గెలాక్సీ A35 5G, గెలాక్సీ M36 5G, గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G, గెలాక్సీ F36 5G, మరియు గెలాక్సీ F06 5G ఫోన్స్ పై ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ఇండియాలో రూ. 1,29,999 ప్రారంభ ధరతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా పండుగ సేల్ నుంచి కేవలం రూ. 71,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. రూ. అలాగే, రూ. 74,999 ధరతో వచ్చిన గెలాక్సీ S24 (స్నాప్ డ్రాగన్) ఫోన్ రూ. 39,999 ఆఫర్ ధరతో మరియు రూ. 59999 ధరతో వచ్చిన గెలాక్సీ S24 (Exynos) ఫోన్ రూ. 29,999 ఆఫర్ ధరతో పండుగ సేల్ నుంచి లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ A55 5జి ఫోన్ పండుగ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో రూ. 23,999 ధరతో సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 39,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అలాగే, రూ. 30,999 స్టార్టింగ్ ప్రైస్ తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A55 5జి ఫోన్ కేవలం రూ. 17,999 ధరకు లభిస్తుంది.
ఇక శాంసంగ్ గెలాక్సీ బడ్జెట్ సిరీస్ ఫోన్ల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ M36 5జి ఫోన్ రూ. 13,999 ఆఫర్ ధరకు, శాంసంగ్ గెలాక్సీ M16 5జి ఫోన్ 10,499 రూపాయల ప్రారంభ ధరతో మరియు శాంసంగ్ గెలాక్సీ M06 5జి ఫోన్ కేవలం రూ. 7,499 ధరకు లభిస్తాయి.
Also Read: Kodak Smart TV: అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొడాక్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఇక చివరిగా శాంసంగ్ గెలాక్సీ F సిరీస్ ఫోన్స్ ఆఫర్ ప్రైస్ విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ F36 5జి ఫోన్ 13,999 ధరకు మరియు శాంసంగ్ గెలాక్సీ F06 5జి ఫోన్ రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తాయి. అంటే, ఈ పండుగ సీజన్ సేల్ తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు చాలా చవక ధరలో లభిస్తాయి.