RTGS పైన కొత్త విధానాన్ని ప్రకటించిన RBI

Updated on 29-May-2019
HIGHLIGHTS

RBI ఆన్లైన్ లావాదేవీల దృష్ట్యా RTGS లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ నిర్ణిత సమయాన్ని పెంచింది.

రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త ఆన్లైన్ బ్యాంకింగ్ LINK ను ప్రకటించింది. వాస్తవానికి, డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి RBI ఆన్లైన్ లావాదేవీల్లో కొత్త నియమాలను చేర్చింది. RBI ఆన్లైన్ లావాదేవీల దృష్ట్యా RTGS లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ నిర్ణిత సమయాన్ని పెంచింది.

ఇప్పటివరకూ, రిజర్వ్ బ్యాంక్ RTGS ద్వారా డబ్బును పంపే సమయాన్ని 4:30 PM వరకు నిర్ణిత సమయాన్ని నిర్ణయించింది.  అయితే, కోత్తగా తీసుకున్న నిర్ణయంతో ఈ సమయాన్ని 6:00 PM వరకూ పెంచింది. ఈ నియమం 2019 జూన్ 1వ తేదీ నుండి వర్తించబడుతుంది. ఎప్పటిలాగానే, వినియోగదారులు సెలవు దినం లేదా ఆదివారం రోజున RTGS సేవలను ఉపయోగించలేరు.

రిజర్వుబ్యాంకు మంగళవారం దీనిగురించి ప్రకటించింది.  RTGS కోసం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కస్టమర్ లావాదేవీల సమయం పెంచబడింది. RTGS సర్వీసును కూడా ఆన్లైన్లో లేదా బ్యాంకు ద్వారా ఉపయోగించవచ్చని, దీని గురించి RBI పేర్కొంది.

RTGS అంటే ఏమిటి?

RTGS ద్వారా లావాదేవీలు చేయడానికి, ఖాతాదారుడు, (IFSC) (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్), లబ్ధిదారు పేరు, ఖాతా సంఖ్య మరియు బ్యాంక్ పేరును కలిగి ఉండాలి. బ్యాంక్ శాఖల ద్వారా RTGS లావాదేవీలను చేయగోటు వారికి ఇది తప్పనిసరి. ఖాతాదారుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతా ద్వారా RTGS లావాదేవీలను చెయ్యవచ్చు.

మీరు RTGS ద్వారా డబ్బు బదిలీ చేస్తే, ఈ మొత్తం అమౌంట్ కూడా వెంటనే బదిలీ చేయబడుతుంది మరియు ఈ సదుపాయం ప్రధానంగా పెద్ద మొత్తంలో బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. RTGS ద్వారా ఖాతాదారు కనీసం 2 లక్షల రూపాయల మొత్తాన్ని పంపవచ్చు మరియు గరిష్ట మొత్తానికి పరిమితి లేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :