reliance launches Jio Bharat B2 from IMC 20205
భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు IMC 20205 కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి రిలయన్స్ జియా అతి చవక ధరలో Jio Bharat B2 ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. ఇండియా యొక్క సేఫ్టీ ఫస్ట్ ఫోన్ అని దీని గురించి రిలయన్స్ ట్యాగ్ లైన్ అందించింది. ఈ ఫోన్ చాలా చవక ధరలో యూజర్ సేఫ్టీ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇండియాలో నిర్వహించే అతిపెద్ద టెక్ షో ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2025 నుంచి ఈరోజు రిలయన్స్ జియో ఈ కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. యూజర్ సేఫ్టీ కోసం పెద్దపీట వేస్తూ ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 799 రూపాయల అతి చవక ధరలో అందించి అందరిని ఆశ్చర్యపరిచింది. జియో ప్రకారం, ఈ ఫీచర్ ఫోన్ తో పిల్లలు మరియు పెద్దల సెక్యూరిటీ మోనిటర్ చేయవచ్చని చెబుతున్నది. ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ జియో స్టోర్, జియో మార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇంస్టా మార్ట్ మరియు అన్ని మొబైల్ షాప్స్ నుండి లభిస్తుంది.
ఈ జియో భారత్ కొత్త ఫోన్ సేఫ్టీ షీల్డ్ ఫీచర్ తో వస్తుంది. ఇది లైవ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ మోనిటర్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఫోన్ అండ్ సర్వీస్ హెల్త్, యూసేజ్ మోనిటర్ మరియు 7 రోజులు పని చేసే బ్యాటరీ వంటి ఫీచర్స్ కేవలం రూ. 799 ధరలో అందిస్తుంది.
ఈ ఫోన్ 2.4 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏకంగా 455 కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ అందించే జియో యాక్సెస్ అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్ ఇందులో అందించిన సేఫ్టీ షీల్డ్ ఫీచర్. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ తో ఈ ఫోన్ ను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ఫీచర్ కనెక్ట్ చేసి పూర్తిగా మోనిటర్ చేసే అవకాశం ఉంటుందని జియో చెబుతోంది.
Also Read: Sonodyne Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
జియో భారత్ బి2 ఫీచర్ ఫోన్ 200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 7 రోజులు పని చేస్తుందని జియో తెలిపింది. ఈ ఫోన్ చాలా చవక రేటుతో వచ్చే జియో ఫోన్ రీఛార్జ్ తో పని చేస్తుంది. అంటే, ఈ ఫోన్ చవక ధరలో లభించడమే కాకుండా నడపడానికి కూడా చాలా తక్కువ రీఛార్జ్ మాత్రమే తీసుకుంటుంది.