Redmi Turbo 5 top features know before launch
Redmi Turbo 5 స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ను కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను గొప్ప పర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. చెప్పిన మాటకు మరియు ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కంటే ముందే రివీల్ చేసిన టాప్ 5 ఫీచర్స్ కి ఎంతవరకు మ్యాచ్ అవుతోందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రెడ్ మీ ఈ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ కలిగిన మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ డిజైన్ తో ఈ ఫోన్ ను చాలా ప్రీమియం లుక్ తో అందిస్తుంది. అదనంగా IP66, IP68, IP69 ఇండస్ట్రీ లీడింగ్ రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
రెడ్ మీ టర్బో 5 ఫోన్ లో 1.5K OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంది. కాబట్టి, ఈ డిస్‌ప్లే స్క్రోలింగ్ మరియు గేమింగ్ అనుభవం మరింత స్మూత్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ కూడా కలిగి ఉంటుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8500 Ultra చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది.12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ తో పాటు ఫాస్ట్ రెస్పాన్స్ UFS 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ స్పెక్స్ తో గేమింగ్, మల్టీటాస్కింగ్ మరియు హెవీ యాప్స్ వినియోగంలో కూడా వేగవంతమైన పనితీరును అందుకోవచ్చు.
ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ మెయిన్ సెన్సార్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ తో ఉంటుంది. కాబట్టి, ఈ ఫోన్ షేక్ లేని ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
Also Read: FIFA World Cup 2026 : భారత్ లో ప్రసార హక్కులు చేజిక్కించుకున్న Zee5 .. ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి పండగే!
ఈ రెడ్ మీ కొత్త ఫోన్ 7,560mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. అలాగే, ఈ ఫోన్ కలిగిన బిగ్ బి బ్యాటరీని అతివేగంగా ఛార్జ్ చేసే 100W హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించింది.
ఓవరాల్ గా రెడ్ మీ ఫస్ట్ టీజింగ్ నుంచి ఫాలో అవుతున్న క్యాప్షన్ కి మరియు టీజర్ ఇమేజ్ లో రివీల్ చేసిన టాప్ 5 ఫీచర్స్ తో న్యాయం చేసేలా అనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ ప్రైస్ మరియు వాడిన తర్వాత ఫోన్ అందించే పెర్ఫార్మన్స్ లెక్కించిన తర్వాత మాత్రమే నిజమైన ఒపీనియన్ మేము ఇవ్వగలుగుతారు.