Redmi Pad 2 Pro 5G: భారీ 12,000 mAh బ్యాటరీ అండ్ డాల్బీ విజన్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 26-Dec-2025
HIGHLIGHTS

కొత్త సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం షియోమి రెడీ అయ్యింది

రెడ్ మీ నోట్ 15 ఫోన్ తో పాటు రెడ్ మీ పాడ్ 2 ప్రో కూడా లాంచ్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ 12,000 mAh బ్యాటరీ తో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది

Redmi Pad 2 Pro 5G : కొత్త సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం షియోమి రెడీ అయ్యింది. రెడ్ మీ నోట్ 15 ఫోన్ తో పాటు రెడ్ మీ పాడ్ 2 ప్రో కూడా లాంచ్ చేస్తోంది. ఈ రెండు డివైజెస్ కీలక ఫీచర్లు మరియు లాంచ్ డేట్ కూడా షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ 12,000 mAh బ్యాటరీ అండ్ డాల్బీ విజన్ స్క్రీన్ తో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది.

Redmi Pad 2 Pro 5G : లాంచ్ డేట్?

రెడ్ మి పాడ్ 2 ప్రో టాబ్లెట్ ను 2026 జనవరి 6న ఇండియాలో పరిచయం చేస్తుంది. ఈ పాడ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుండి ఈ టాబ్లెట్ ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.

Redmi Pad 2 Pro 5G: ఫీచర్స్

రెడ్ మీ పాడ్ 2 ప్రో చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కొత్త పాడ్ 12.1 ఇంచ్ నిగ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ రెడ్ మీ పాడ్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప విజువల్స్ అందించే డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పాడ్ ని లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ నుంచి అనౌన్స్ చేసింది. అయితే, ఈ చిప్ సెట్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు.

రెడ్ మీ పాడ్ 2 ప్రో పటిష్టమైన మెటల్ యూనీ బాడీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ పాడ్ అతి సన్నని డిజైన్ కలిగి ఉన్నా కూడా 1200 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ బ్యాటరీతో ఎక్కువ సమయం ఈ పాడ్ నిలిచి ఉంటుందని రెడ్ మీ తెలిపింది. ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన ఈ పాడ్ వేగంగా ఛార్జ్ చేసే వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: Oppo Reno 15 Pro Mini: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్న ఒప్పో.!

ఈ అప్ కమింగ్ పాడ్ లో క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. క్వాడ్ స్పీకర్ సెటప్ తో పాటు మంచి సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ పాడ్ ఒక్కొక్క ఫీచర్స్ ని విడుదల చేస్తుంది కాబట్టి, ఈ పాడ్ లాంచ్ చేయడానికి ముందే మిగిలిన కీలక ఫీచర్స్ కూడా విడుదల చేస్తుంది. ఈ పాడ్ ముందు వచ్చిన పాడ్ కంటే మరింత శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :