REDMI NOTE 7S ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది

Updated on 23-May-2019
HIGHLIGHTS

ఇండియాలో షావోమి విడుదల చేసినటువంటి  REDMI NOTE 7S స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart, mi.com మరియు మి హోమ్ నుండి జరగనుంది. కేవలం రూ. 10,999 ధరలో ఒక 48MP కెమేరామరియు ఇంకామరెన్నో ప్రత్యేకతలతో ఇండియాలో విడుదలైనటువంటి ఈ REDMI NOTE 7S స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెక్స్ ఇవిగో!.       

షావోమి రెడ్మి నోట్ 7S : ధర

షావోమి రెడ్మి నోట్ 7S –  3GB RAM + 32GB స్టోరేజి ధర – 10,999

షావోమి రెడ్మి నోట్ 7S –  4GB RAM + 64GB స్టోరేజి ధర – 12,999

షావోమి రెడ్మి నోట్ 7S :  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్,  FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 256GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు రూబీ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP + 5MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా SAMSUNG GM1 సెన్సారుతో వస్తుంది మరియు 5MP కెమేరా పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 13MP AI కెమెరాని అందించారు. ఇందులో పోర్ట్రైట్, బొకేహ్ వంటి మరెన్నో ఎంపికలతో సెల్ఫీలను క్లిక్ చెయ్యొచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రక్షణనిస్తుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :