REDMI Note 15 Pro 5G ముందస్తు బుకింగ్ పేజీ నుంచి కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!

Updated on 26-Jan-2026
HIGHLIGHTS

REDMI Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందు కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసింది

అమెజాన్ ఇండియా నుంచి అందించిన ప్రత్యేకమైన పేజీ నుంచి ఈ వివరాలు అందించింది

ఈ పేజీ నుంచి ఈ ఫోన్ ను మీరు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు

REDMI Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ కోసం అమెజాన్ ఇండియా నుంచి అందించిన ప్రత్యేకమైన పేజీ నుంచి ఈ వివరాలు అందించింది. ఈ పేజీ నుంచి ఈ ఫోన్ ను మీరు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. షియోమీ వెల్లడించిన ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.

REDMI Note 15 Pro 5G : ప్రీ బుకింగ్

రెడ్ మీ నోట్ 15 ప్రో మరియు రెడ్ మీ నోట్ 15 ప్రో ప్లస్ రెండు ఫోన్లు కూడా ఈ నెల 29 వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. కంపెనీ ఇప్పుడు రెండు స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ ను మొదలు పెట్టింది. కేవలం రూ. 1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ లను మీరు ముందుగా ప్రీ బుక్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ ను ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11:59 గంటల లోపు చెల్లించి ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను ముందుగా బుకింగ్ చేసుకునే యూజర్లకు రూ. 2,499 రూపాయల విలువైన వన్ ఇయర్ వ్యాలిడిటీ కలిగిన 1 ఉచిత స్క్రీన్ రిప్లేసెమెంట్ ఆఫర్ లభిస్తుంది.

ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB + 128GB తో మరియు హై ఎండ్ వేరియంట్ 8GB + 256GB తో ఉంటుంది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మిరాజ్ బ్లూ మరియు సిల్వర్ యాష్ ముందు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Also Read: vivo X200T ఇండియా లాంచ్ కంటే ముందే ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

REDMI Note 15 Pro 5G : ఫీచర్స్

రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K QHD రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆకట్టుకునే స్లీక్ డిజైన్ తో ఉంటుంది.

రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 200MP (4th Gen HPE) మెయిన్ కెమెరా ఉంటుంది. 2x/4x ఇన్ సెన్సార్ జూమ్ తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6580 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 400% లౌడ్ సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :