Redmi Note 15 key specs revealed
Redmi Note 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కి సిద్ధం అయ్యింది మరియు ఈ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ వేగం పెంచింది. ఈ ఫోన్ టీజింగ్ కోసం అమెజాన్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది. ముందు కెమెరా వివరాలు అందించిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ చిప్ సెట్ వివరాలు కూడా అందించింది.
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని మాత్రమే కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తోంది.
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కర్వుడ్ డిజైన్ మరియు వెనుక కర్వుడ్ బ్యాక్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో Snapdragon 6Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ చిప్ సెట్ దీనికంటే ముందు వచ్చిన చిప్ సెట్ కంటే 10% GPU బూస్ట్, 30% CPU బూస్ట్ మరియు 48 నెలల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని షియోమీ టీజింగ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో అందించిన కెమెరా మరియు బ్యాటరీ వివరాలు కూడా కంపెనీ ముందే రివీల్ చేసింది. రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ లో 5520 mAh బ్యాటరీ ఉంటుంది మరియు ఇది 5 సంవత్సరాల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ OIS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైనమిక్ షాట్ మరియు మల్టీ ఫోకల్ పోర్ట్రైట్ లెజెండ్ వంటి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: 5G Network ఉన్నా చాలా మందికి ఎందుకు ఫుల్ స్పీడ్ రావడం లేదు.. అసలు కారణం ఇదే.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్స్ కూడా త్వరలోనే ప్ వెల్లడించే అవకాశం ఉంది.