Redmi Note 15 complete features know before launch in India
Redmi Note 15 : షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్‌సెట్‌తో ఇండియాలో ఎంట్రీ కి సిద్ధం అయ్యింది. 2026 నూతన సంవత్సర ప్రారంభంలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా షియోమీ పూర్తిగా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పై ఒక లుక్కేద్దామా.
స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్‌సెట్ త్రయ మంత్రంతో ఈ ఫోన్ ను ఐదునియాలో ప్రవేశపెట్టాలని రెడ్ మీ యోచిస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ లో మీకు ఈ ఫోన్ డిజైన్ మిమ్మల్ని ఆకట్టుకునే కంప్లీట్ ఆల్ న్యూ డిజైన్ తో ఉంటుంది. ఇది కేవలం 7.35mm తో చాలా స్లీక్ గా ఉంటుంది. అంతేకాదు, ఇది మరింత స్లీక్ గా కనిపించే కర్వుడ్ డిజైన్ తో ఉంటుంది.
ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఆకట్టుకుంటుంది. చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలో స్క్రీన్ పై చినుకులు పడినా కూడా స్క్రీన్ చక్కగా పనిచేసే హైడ్రో టచ్ 2.0 ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ కొత్త చిప్ సెట్ Snapdragon 6 Gen 3 తో పని చేస్తుంది. ఇది Ai సపోర్ట్ తో కూడా ఉంటుంది.
కెమెరా పూర్వకంగా ఈ ఫోన్ లో వెనుక పెద్ద సర్కిల్ బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 108MP OIS మెయిన్ సెన్సార్ ఉంటుంది మరియు ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు డైనమిక్ షాట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 5520 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఇది దాదాపు 5 సంవత్సరాల జీవిత కాలం కలిగి ఉంటుందని రెడ్ మీ చెబుతోంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.
Also Read: 2026 Upcoming Phones: కొత్త ఏడాదిలో ముందుగా లాంచ్ అవుతున్న ఫోన్స్ లిస్ట్.!
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ 2026 జనవరి 6న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.