విడుదలకు ముందే లీకైన Redmi 12 5G ఫోన్ ధర మరియు స్పెక్స్.!

HIGHLIGHTS

Redmi 12 5G స్పెక్స్ మరియు అంచనా ధరలు ఆన్లైన్ లో లీకయ్యాయి

బడ్జెట్ 5G ఫోనుగా ఈ ఫోన్ వస్తోందని కితాబు

బిగ్ ర్యామ్ మరియు హెవీ స్టోరేజ్ తో ఫోన్ ప్రస్తావన

విడుదలకు ముందే లీకైన Redmi 12 5G ఫోన్ ధర మరియు స్పెక్స్.!

Redmi 12 5G స్మార్ట్ ఫోన్ ఆగష్టు 1వ తేదీన ఇండియాలో లాంచ్ కోసం సిద్ధమవుతుండగా, ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు అంచనా ధరలు ఆన్లైన్ లో లీకయ్యాయి. ట్విట్టర్ నుండి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు అంచనా ధరలను ఇన్ఫ్లుయన్సర్లు పంచుకున్నారు. ఈ ఫోన్ ను షియోమి బడ్జెట్ సెగ్మెంట్ 5G స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తోందని చెబుతన్నారు.  షియోమి యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి లీక్డ్ మరియు అంచనా స్పెక్స్ తో పాటుగా అంచనా ధర పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 12 5G: అంచనా ధర

ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ యొక్క అంచనా ధరలను మరియు అంచనా స్పెక్స్ ను గురించి తన ట్విట్టర్  ట్వీట్ చేశారు. ఈయన ప్రకారం ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో వస్తుంది. ఈ ఫోన్ రూ. 13,999 రూపాయల ప్రారంభ ధరతో వస్తుంది. ఈ ఫోన్ 6GB + 128GB మరియు 8GB + 256GB వేరియంట్స్ లో వస్తుందని కూడా   

Redmi 12 5G: అంచనా స్పెక్స్ 

రెడ్ మి 12 5G స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ డిస్ప్లే ని 90Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS, 8GB వరకూ ర్యామ్ మరియు 256GB వరకూ హెవీ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్ యొక్క కెమేరా సెటప్ ను కూడా యాదవ్ అంచనా వేశారు. ఈ ఫోన్ లో 50MP  ప్రధాన కెమేరాకి జతగా 2MP సెన్సార్ జతగా ఉంటుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇందులో, 5000 mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది.

 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo