రెడ్‌మి నోట్ 10 టి బడ్జెట్ 5G ఫోన్ రేపు లాంచ్ అవుతోంది

Updated on 19-Jul-2021
HIGHLIGHTS

రేపు లాంచ్ అవుతున్న షియోమి బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌

షియోమి బడ్జెట్ 5G ఫోన్

రేపు లాంచ్ అవుతున్న షియోమి బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ Redmi Note 10T 5G. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి షియోమి సిద్దమవుతోంది. వాస్తవానికి, ఇటీవలే రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ను రష్యన్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ 5G ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా వస్తోంది. అంతేకాదు, ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ స్పెక్స్ పరంగా దాదాపుగా పోకో ఎం 3 ని పోలి ఉంటుంది. ఎందుకంటే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రొసెసర్ Dimensity 700 తో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రష్యన్ మార్కెట్లో ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ RUB 19,990 రేటుతో అందించింది. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.20,500 రూపాయలు. అయితే, భారతదేశంలో దీని ధర వివరాలు తెలియాలంటే రేపటి వరకూ వేచి ఉండాల్సిందే.    

ఇక రష్యాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 48MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :