లీకైన స్పెక్స్ ద్వారా REDMI K 30 ఒక 6.6 అంగుళాల 120Hz డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తోంది

Updated on 26-Nov-2019
HIGHLIGHTS

ఈ లీకైన స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ అతిత్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనునట్లు కూడా తెలుస్తోంది.

ఈ సంవత్సరంలో షావోమి సంస్థ వివిధ రకాలైన ధారలలో తన స్మార్ట్ ఫోన్లను అనేకమైన వాటిని లాంచ్ చేసి మిగిలిన వాటికంటే ముందు వరుసలో నిలుచుంది. అంతటితో ఆగకుండా, మరికొన్ని స్మార్ట్ ఫోన్లను అందించడానికి పనిచేస్తోంది. షావోమి, త్వరలో తీసుకురానున్నట్లు చెబుతున్న స్మార్ట్ ఫోన్ అయినటువంటి, REDMI K30 గురించిన లీకైన ఒక సరికొత్త సమాచారం ద్వారా దీని స్పెక్స్ గురించి  మరిన్ని వివరాలను అందించాయి. ఈ లీకైన స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ అతిత్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనునట్లు కూడా తెలుస్తోంది.

చాలా కాలం నుండు ఎదురుచూస్తున్న REDMI K30 స్మార్ట్ ఫోన్ను, అతిత్వరలోనే కంపెనీ లాంచ్ చేయాలనీ చూస్తోందని తేటతెల్లమయ్యింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ లీక్స్ ద్వారా ఇది ఒక పెద్ద పంచ్ హోల్ డిజైనుతో రానున్నట్లు కనిపిస్తోంది. అలాగే, ఒక 5G సపోర్టుతో ఈ ఫోన్ను తీసుకురానున్నట్లు ముందు నుండే చెబుతోంది, కానీ ఇక్కడ అందించిన లీక్ ఇమేజిలో ఇది Adreno 618 GPU తో కనిపిస్తోంది. అంటే, మనకు తెలుసు ఈ GPU స్నాప్ డ్రాగన్ 730 మరియు 730G తో వస్తుందని, ఇది గేమింగ్ కోసం మంచి ప్రాసెసర్ మాత్రమే ఇది 5G సపోర్ట్ కలిగిలేదు. దీని ప్రకారం, ఈ ఫోనులో 5G ఇవ్వడం గురించి వస్తున్నాఒట్టిమాటే కావచ్చు.

అధనంగా, ఈ లీకైన ఇమేజి ద్వారా మిగిలిన స్పెక్స్ గమనించినట్లయితే, ఇది ఒక 6.6 అంగుళాల స్క్రీన్ను 120Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఈ Adreno 618 GPU ని ఈ ఫోనులో చూస్తున్నాం కాబట్టి, ఈఫోలు రెడ్మి K 20 ప్రో స్మార్ట్ ఫోన్ మాదిరిగా ఒక స్నాప్ డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్ ని ఇస్తుందో లేదో చూడాల్సివుంటుంది. ఇక సంస్థ యొక్క CEO అయినటువంటి, లీ జున్ ఇది లాంచ్ సమయానికి MIUI 11 పైన నడుస్తుందని  ద్రువీకరించారు.               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :