OnePlus ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి OnePlus 7 Pro లాంచ్ తర్వాత, Xiaomi కూడా త్వరలో లాంచ్ చేయనున్న, తన ఫ్లాగ్ షిప్ కిల్లర్ Redmi K20 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగును మొదలుపెట్టింది. షావోమి యొక్క ట్విట్టర్ పేజీలో అందించిన టీజింగ్ ద్వారా ఈ K20 స్మార్ట్ ఫోన్ హై ఎండ్ చిప్సెట్ అయినటువంటి, స్నాప్డ్రాగెన్ 855 కలిగినట్లు ధ్రువీకరించారు. రెడ్మి బ్రాండ్ నుండి మొదటి సారిగా ఈ స్మార్ట్ ఫోన్ ఒక హై ఎండ్ ప్రాసెసర్తో అందించబడుతుంది. దీనికి ముందు, Redmi సిరీస్ నుండి దాదాపుగా అన్ని ఫోన్లు కూడా మధ్య శ్రేణి మరియు బడ్జెట్ ప్రాసెసర్లతో తీసుకురాబడ్డాయి.
అది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ యొక్క AnTuTu స్కోరు కూడా చాలా ఎక్కువ స్కోరును పొందింది. స్నాప్డ్రాగెన్ 855 ప్రాసెసర్ ద్వారా నడుస్తున్నట్లు చూపిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ అత్యధికంగా స్కోరును సాధించింది. ఈ K20 మోడల్ సంకేతపదంతో చెయ్యబడింది మరియు AnTuTu బెంచ్ మార్కు పైన 4,58,754 స్కోర్ చేసింది. ఇక Mi 9 సాధించినటువంటి 370,00 రుతో పోలిస్తే ఇది ఎంత ఎక్కువగా ఉంటుందో మీరే ఊహించుకోండి.
దీన్ని బట్టి చూస్తుంటే రెడ్మి ఫ్లాగ్షిప్ మార్కెట్లోకి ప్రవేశించబోతునట్లు కనిపిస్తోంది, కానీ ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర గురించి ఎవరూ ఊహించలేరు కాబట్టి, అది లాంచ్ అయ్యివరకు వేచిచూడాల్సిందే. K20 తరువాత Poco F2 రావచ్చని అంచనా వేస్తున్నారు. Poco భారతదేశం లో ఇప్పటికే చాలా ప్రజాదరణ పొందింది మరియు త్వరలోనే, ఇండియాలో ఒక కొత్త ఫ్లాగ్ షిప్ పరికరం లాంచ్ చెయ్యవచ్చని అంచనావేస్తున్నారు.