ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకి రెడ్మి గో ప్లాష్ సేల్ నిర్వహిస్తున్న షావోమి సంస్థ

Updated on 28-Mar-2019
HIGHLIGHTS

మొదటి సేల్ ప్రటకటించిన నాటి నుండి ప్రతి రోజు ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది.

ఇండియాలో తక్కువ ధరకే, స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ గో తో తీసుకొచ్చిన ఈ రెడ్మి గో యొక్క ఫ్లాష్ సేల్ ప్రతి రోజు నిర్వహిస్తోంది షావోమి సంస్థ. ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకి ఈ సేల్ నిర్వహిస్తోంది మరియు మంచి అమ్మకాలను కూడా సాధిస్తునట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు, మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతున్న సేల్ నుండి సులభంగా కొనవచ్చు.         

Redmi Go అధనపు ఆఫర్లు ఆఫర్లు

జియో దీనిపైన ఏకంగా 2,200 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించడం విశేషం. దీనికి అదనంగా, 100GB డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అంటే, ఈ ఆఫర్లన్నీ కూడా కలగలుపుకుంటే, ఈ రెడ్మి గో యొక్క ధర సగానిపైగా తగ్గిపోతుంది. అధనంగా, flipkart నుండి Axis బ్యాంక్ యొక్క Buzz క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి, 5% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, 6 నెలలకు గాను EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి, No Cost EMI కూడా అందుబాటులోవుంది, నెలకు కేవలం 750 రూపాయలు మాత్రమే చెల్లించాల్సివుంటుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ జరగనుంది. 

అయితే, ఈ 2,200 రూపాయల క్యాష్ బ్యాక్ ని 44 సమానమైన ఓచర్ల రూపంలో అందిస్తుంది. ఒక్కొక్క ఓచర్ 50 రూపాయల విలువతో ఉంటుంది. అలాగే, ఈ ఓచర్లను కేవలం రూ. 198 మరియు రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో మాత్రమే రిడీమ్ చేసుకుం అవకాశం ఉంటుంది. ఇంకా అదనపు 100GB ఉచిత డేటాని 10GB చొప్పున మొదటి రీఛార్జ్ నుండి 10 రీఛార్జిల వరకు అందుకుంటారు.                    

Redmi Go ప్రత్యేకతలు 

ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ రెడ్మి గో 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజికి జతగా 1 జీబి ర్యామ్ తో  ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది. ఈ ఫోన్ రూ.4,499 రూపాయల ధరతో అందుబాటులో ఉంటుంది.  

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే  ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 20 కి పైగా భారతీయ భాషలను కలిగివుంటుంది మరియు ప్రత్యేకంగా హిందీ భాషలో "Google Assistance" ని కూడా కలిగివుంటుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :