Redmi A7 Pro 5G launched under budget price and and know complete features
Redmi A7 Pro 5G: షియోమీ ఉప బ్రాండ్ రెడ్ మీ ఈరోజు ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ధరలో మంచి ఫీచర్స్ తో రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో అందించింది.
ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (4 జీబీ + 64 జీబీ) వేరియంట్ ను రూ. 11,499 ప్రైస్ తో మరియు (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 12,499 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ మిస్ట్ బ్లూ మరియు సన్ సెట్ ఆరెంజ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ స్టైల్ డిజైన్ మరియు రీగల్ కెమెరా డేకో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 ఆక్టా కోర్ 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు మినిమం గేమింగ్ కోసం సరిపోతుంది.
ఈ రెడ్ మీ ఫోన్ Hyper OS 3 మరియు ఆండ్రాయిడ్ 16 OS తో వచ్చింది. 4 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది. బ్యాటరీ పరంగా, రెడ్ మీ ఈ బడ్జెట్ ఫోన్ ను 6300 భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 15W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.
Also Read: BSNL Best Plan: 70 రోజులు హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!
ఈ ఫోన్ 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 300% వాల్యూమ్ అందించే బోటమ్ ఫైరింగ్ స్పీకర్, 3.5 జాక్ మరియు సింగల్ మైక్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ స్పెక్స్ షీట్ చూస్తుంటే, ఓవరాల్ గా ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా షియోమీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పొచ్చు.