REDMI 8 యొక్క ఫ్లాష్ సేల్

Updated on 21-Nov-2019
HIGHLIGHTS

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది.

షావోమి సంస్థ, తన రెడ్మి 8 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.7,999 ధరలో  విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా, ఒక 5,000 బ్యాటరీని మరియు బాక్స్ తో పాటుగా 10W స్పీడ్ చార్జరును అందిస్తోంది. అలాగే,ఈ ఫోన్ 3GB మరియు 4GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి 5 మిలియన్ యూనిట్లకు గాను రెడ్మి 8 యొక్క 4GB +64GB  స్టోరేజి వేరియంట్ ను కేవలం Rs.7,999 ధరకే అమ్మనునట్లు సంస్థ ప్రకటించింది.  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది.      

రెడ్మి 8 : ధర

 1. రెడ్మి 8 (4GB +64GB ) ధర – Rs.7,999

రెడ్మి 8 :స్పెసిఫికేషన్స్

ఈ రెడ్మి 8  డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్ మరియు ఈ డివైజ్ 720P పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన ఒక 6.22 అంగుళాల HD+  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో  అందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను Aura Mirror డిజైన్ తో చేయడంవలన, వెనుక ప్యానల్ మెరిసేలా ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 3GB/4GB ర్యామ్ తో వస్తుంది. ఇది రెండువేరియంట్లలో వరుసగా 32GB,64GB  స్టోరేజి కలిగివుంటుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజిని 512 GB వరకూ పెంచుకోవచ్చు.     

ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు కేవలం ఒక 12MP ప్రధాన కెమేరాకు జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ జతగా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇది Sony IMX363 సెన్సారుతో ఉంటుంది. అలాగే,  ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP  కెమెరా ఉంటుంది. ఇక ఈ ఫోన్ను బలమైన 5,000 mAh బ్యాటరీతో మరియు 18W స్పీడ్ ఛార్జింగ్ సపోర్టుతో తీసుకొచ్చింది. అలాగే, సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా అందించింది. ఇది ఓనిక్స్ బ్లాక్, సఫైర్ బ్లూ,  రూబీ రెడ్ మరియు ఏమిరాల్డ్ గ్రీన్ వంటి నాలుగు రంగుల ఎంపికలతో లభిస్తుంది.                    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :