రెడ్మి7A మరియు రెడ్మి నోట్ 8 ప్రో MIUI 11 అప్డేట్ అందుకుంటున్నాయి.

Updated on 19-Dec-2019
HIGHLIGHTS

రెడ్మి నోట్ 8 ప్రో MIUI 11.0.3 అప్డేట్ ను ఇప్పటికే అందుకుంది.

షటమి యొక్క రెండు స్మార్ట్ ఫోన్లయినటువంటి, రెడ్మి నోట్ 8 ప్రో మరియు రెడ్మి 7 ఎ, ఇప్పుడు కొత్త MIUI 11 సాఫ్ట్‌ వేర్ అప్డేట్ ను అందుకుంటున్నాయి. బ్యాచ్‌లలోని రెండు ఫోన్ల కోసం కొత్త అప్‌ డేట్ అందుబాటులోకి వస్తోంది మరియు కొన్ని రోజుల్లో అన్ని యూనిట్లకు ఈ అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విట్టర్‌ లో వినియోగదారులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెడ్మి నోట్ 8 ప్రో, రెడ్మి 7 ఎ కోసం MIUI 11 అందుబాటులోకి వస్తున్నట్లు రెడ్మి ధృవీకరించింది. ఈ క్రొత్త అప్డేట్  ఈ రెండు ఫోన్లలో, ఎల్లప్పుడూ(ఆల్వేస్) ఆన్-డిస్ప్లే, గేమ్ బూస్టర్, మి డాక్ వ్యూయర్ మరియు ఇటువంటి మరిన్ని కొత్త అప్డేట్ లను అందిస్తుంది. రెడ్మి నోట్ 8 ప్రో MIUI 11.0.3 అప్డేట్ ను ఇప్పటికే అందుకుంది.

రెడ్మి 7 ఎ మరియు రెడ్మి నోట్ 8 ప్రో కూడా ఈ అప్డేట్ తో నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ కు కూడా అప్డేట్ చేయబడతాయి. ఈ కొత్త MIUI 11 అప్డేట్, ఫోన్ల కోసం మినిమాలిస్టిక్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ ను తెస్తుంది మరియు పరిసర ప్రదర్శనను అనుకూలీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇన్‌ కమింగ్ సందేశాలకు సులభంగా తిరిగి రావడానికి క్విక్ రిప్లై ఎంపిక కూడా ఉంటుంది, కొత్త మి షేర్ ఎంపికతో పాటు ఫోన్ల మధ్య ఫైల్స్ ను త్వరగా షేర్ చేయగలదు. ఫైల్ మేనేజర్ కొత్త MIUI అప్డేట్ తో సరిదిద్దబడింది మరియు ఇది ఇప్పుడు ప్రతి ఫైల్‌ కు మైక్రో ప్రివ్యూ ను చూపుతుంది. అయితే, ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ 9 పై పైన ఆధారపడి కాకుండా ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడి ఉందని గమనించాలి.

రెడ్మి 7 ఎ మరియు రెడ్మి నోట్ 8 ప్రో కోసం MIUI 11 అప్‌ డేట్ ను కంపెనీ రెడ్మి 8, రెడ్మి 8 ఎ, రెడ్మి 4 లకు సంబంధించిన అప్‌ డేట్‌ ను విడుదల చేయడం ప్రారంభించిన వెంటనే వస్తుందని, షావోమి ఇటీవలే ట్వీట్ చేసింది. ఇటీవలే ప్రారంభించిన అన్ని స్మార్ట్ ఫోన్లు మరియు మూడు సంవత్సరాల పాత ఫోన్ల కోసం, అంటే  షావోమి యొక్క 27 పరికరాలను అక్టోబర్ 22 నుండి MIUI 11 కు అప్‌ డేట్ చేసిందని మరియు 47 రోజుల్లో ఈ అప్డేట్లు రూపొందించబడ్డాయి. అయితే, సంస్థ యొక్క తాజా Android One పరికరం, Mi A3, ఆశ్చర్యకరంగా Android 10 అప్డేట్ ను మాత్రం అందుకోలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :