రెడ్మి 7 యొక్క ఫ్లాష్ సేల్ : ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్నుఅతితక్కువ ధరలో ఒక స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ కలిగివుంటుంది.

రెడ్మి 7 యొక్క ఫ్లాష్ సేల్ : ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి

ఇటీవల, షావోమి రెడ్మి Y3 తో పాటుగా, Redmi 7 స్మార్ట్ ఫోన్నుకూడా విడుదల చేసింది మరియు ఇప్పటివరకూ జరిగిన అమ్మకాలలో ఈ REDMI 7 మంచి అమ్మకాలను కూడా సాధించింది. ఈరోజు ఈ సేల్ అమేజాన్, mi.com మరియు మి హోమ్ నుండి జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్నుఅతితక్కువ ధరలో ఒక స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమేరా మరియు ఒక అతిపెద్ద 4,000 mAh బ్యాటరీతో విడుదలచేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి రెడ్మి 7 ధర మరియు ఆఫర్లు

షావోమి రెడ్మి 7 –  2GB RAM + 32GB స్టోరేజి ధర – 7,999

షావోమి రెడ్మి 7 –  3GB RAM + 32GB స్టోరేజి ధర – 8,999

ఈ ఫోనుతో పాటుగా జియో యొక్క భాగస్వామ్యంతో 4.5 TB 4G డేటా మరియు 2,200 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించింది. అలాగే, ఈ స్మార్ట్బ్ ఫోన్ యొక్క  సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com, అమేజాన్ లలో జరగనుంది.       

షావోమి రెడ్మి 7  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి 7 స్మార్ట్ ఫోన్,  HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 2GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది కమెట్ బ్లూ, ఎక్లిప్స్  బ్లాక్ మరియు లూనార్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది. 

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 8MP AI కెమెరాని అందించారు. ఇందులో సెల్ఫీలను క్లిక్ చేయడం  పామ్ షట్టర్ అనే కొత్త ఫీచరుతో వస్తుంది. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రాకాశానను ఇసుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile