Redmi 15A 5G: బడ్జెట్ సిరీస్ నుంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రెడ్ మీ.!

HIGHLIGHTS

రెడ్ మీ ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి కొత్త 5జి ఫోన్ లాంచ్ చేసింది

Redmi 15A 5G భారీ డిస్ప్లే మరియు భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

రెడ్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది

Redmi 15A 5G: రెడ్ మీ ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి కొత్త 5జి ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్ప్లే మరియు భారీ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో అందించింది. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న బడ్జెట్ ఫోన్స్ లిస్ట్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఈరోజు జత కలిసింది. రెడ్ మీ ఈరోజు కొత్తగా రిలీజ్ చేసిన 15A 5G ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.

Redmi 15A 5G: ప్రైస్

రెడ్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

రెడ్ మీ 5A (4GB + 64GB) ప్రైస్ : రూ. 12,999

రెడ్ మీ 5A (4GB + 128GB) ప్రైస్ : రూ. 14,499

రెడ్ మీ 5A (6GB + 128GB) ప్రైస్ : రూ. 16,499

ఈ స్మార్ట్ ఫోన్ ఏస్ బ్లాక్, అమేజ్ పర్పల్ మరియు ఆసమ్ బ్లూ మూడు రంగులో లాంచ్ చేసింది . ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ సేల్ సేల్ స్టార్ట్ అవుతుంది. Flipkart మరియు Xiaomi అఫీషియల్ సైట్ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.

Also Read: Flipkart కూలింగ్ డేస్ సేల్ నుంచి భారీ సింగిల్ డోర్ Refrigerator డీల్స్ ప్రకటించింది.!

Redmi 15A 5G: ఫీచర్స్

రెడ్ మీ 15 ఏ 5జి స్మార్ట్ ఫోన్ ను బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రైస్ లో ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 120 – 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 800 HBM బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. 15A 5G స్మార్ట్ ఫోన్ ను Unisoc T8300 ఆక్టా కోర్ 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గరిష్టంగా 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 32MP AI డ్యూయల్ కెమెరా ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ మరియు HDR సపోర్ట్ కూడా రెడ్ మీ అందించింది. రెడ్ ఐ 15ఏ స్మార్ట్ ఫోన్ 6300mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 200% వాల్యూమ్ బూస్ట్ స్పీకర్ కూడా మీకు లభిస్తుంది. ఈ రెడ్ మీ లేటెస్ట్ ఫోన్ IP52 రేటింగ్ తో స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :