Xiaomi: అందుబాటులో ధరలో 5G ఫోన్ లాంచ్ చేసింది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!!

HIGHLIGHTS

షావోమి ఈరోజు ఇండియన్ యూజర్లకు అందుబాటులో ధరలో 5G ఫోన్ లాంచ్ చేసింది

Redmi 11 Prime 5G పేరుతో ఇండియన్ మర్కెట్లో లాంచ్

కేవలం రూ.13,999 రూపాయల ధరలో డ్యూయల్ 5G సపోర్ట్ తో వచ్చింది

Xiaomi: అందుబాటులో ధరలో 5G ఫోన్ లాంచ్ చేసింది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!!

షావోమి ఈరోజు ఇండియన్ యూజర్లకు అందుబాటులో ధరలో 5G ఫోన్ లాంచ్ చేసింది. Redmi 11 Prime 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.13,999 రూపాయల ధరలో డ్యూయల్ 5G సపోర్ట్ తో వచ్చింది. అంతేకాదు, 50MP AI కెమెరా, పెద్ద బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆల్ రౌండ్ ఫీచర్లతో వచ్చింది. కేవలం 15 వేల ధరలో 5G ఫోన్ కోరుకునే ఇండియన్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని షావోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసినట్లు మనం ఊహించవచ్చు. ఈ లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం పదండి.             

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 11 Prime 5G: ప్రైస్ & ఆఫర్స్

రెడ్ మి 11 ప్రైమ్ 5జి రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వీటి ధరలు క్రింద చూడవచ్చు.

1. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.13,999

2. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.15,999

లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ అఫర్ ను ప్రకటించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ మరియు mi.com నుండి ఈ ఫోన్ సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మొదటిసారిగా సేల్ కి వస్తుంది.          

Redmi 11 Prime 5G: స్పెక్స్

రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్  రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/4GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది.

ఇక ఇటా ఫీచర్ల విషయానికి వస్తే, ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, FM రేడియో తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo