Redmi 11 Prime 5G: మొదటిసారిగా సేల్ కి వస్తున్న షావోమీ బడ్జెట్ 5G ఫోన్.!!
షావోమి రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5G మొదటి సేల్ రేపు జరగనున్నది
ఈ సేల్ నుండి ICICI బ్యాంక్ 1000 రూపాయల డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది
షావోమి రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi 11 Prime 5G మొదటి సేల్ రేపు జరగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రేపు మధ్యాహ్నం 4 గంటలకి అమెజాన్ మరియు mi.com నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ICICI బ్యాంక్ 1000 రూపాయల డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన ప్రతీ విషయం ఇక్కడ వుంది.
SurveyRedmi 11 Prime 5G: ధర మరియు ఆఫర్లు
రెడ్ మి 11 ప్రైమ్ 5జి రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వీటి ధరలు క్రింద చూడవచ్చు.
1. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.13,999
2. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.15,999
లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ అఫర్ ను ప్రకటించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ మరియు mi.com నుండి ఈ ఫోన్ సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మొదటిసారిగా సేల్ కి వస్తుంది.
Redmi 11 Prime 5G: స్పెక్స్
రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/4GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది.
ఇక ఇటా ఫీచర్ల విషయానికి వస్తే, ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, FM రేడియో తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile