Redmi 10: 50MP క్వాడ్ కెమెరాతో బడ్జెట్ ధరలో లాంచ్… ఫీచర్లు ఎలాఉన్నాయంటే..!

Updated on 19-Aug-2021
HIGHLIGHTS

Redmi 10 ను ప్రీమియం ఫీచర్లతో కేవలం బడ్జెట్ ధరలో లాంచ్

రెడ్‌మి 10 50MP క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది

షియోమీ సబ్ బ్రాండ్ Redmi తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 10 ను ప్రీమియం ఫీచర్లతో కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన ఈ రెడ్‌మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎన్నడూ లేని విధంగా 50MP క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది.  ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తిగా తెల్సుకుందాం..!

Redmi 10: స్పెక్స్

రెడ్‌మి 10 స్మార్ట్ ఫోన్  6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది రీడింగ్ మోడ్ 3.0 తోవస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన పనిచేస్తుంది.

కెమెరాలవిషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ కేమెరా సిస్టం మంచి డెప్త్ ఫోట్లను తెయ్యగలిగే శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.

రెడ్‌మి 10 ఫోన్లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 5,000 బిగ్ బ్యాటరీ మరియు రిటైల్ బాక్స్ లో 22.5W ఫాస్ట్ ఛార్జర్ కూడా అఫర్ చేస్తూంది. ఈ ఫోన్ 9W తో రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు మరియు AI ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

రెడ్‌మి 10: ప్రైస్

బ్లాగ్ పోస్ట్ ప్రకారం, రెడ్‌మి 10 గ్లోబల్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ 179 పౌండ్స్( సుమారు 13,300) ధరతో, 4GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ 199 పౌండ్స్( సుమారు 14,800) ధరతో, 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ 219 పౌండ్స్( సుమారు 16,300) ధరతో ప్రకటించింది. అయితే, ఇండియా లాంచ్ గురిఞ్చి మాత్రం ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :