flipkart నుండి రియల్మీ XT ఓపెన్ సేల్ : అక్టోబర్ 4 వరకూ మాత్రమే

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది

దీపావళి సందర్భంగా, ఫ్లిప్ కార్ట్ తీసుకోచ్చినటువంటి బిగ్ బిలియన్ సేల్ నుండి రియల్మీ సంస్థ ఇటీవల ఒక 64MP క్వాడ్ కెమెరాతో తీసుకొచ్చినటువంటి రియల్మీ XT యొక్క అన్ని వేరియంట్లను ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి ఉంచింది. అయితే, ఈ ఈ సేల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వ తేదీ వరకు జారుతుంది కాబట్టి ఇది అక్టోబర్ 4 వ తేదీ వరకూ మాత్రమే ఓపెన్ సేల్ కి అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతోంది.

Realme XT ధరలు

1. Realme XT  (4GB + 64GB) ధర – Rs.15,999

2. Realme XT (6GB + 64GB) ధర – Rs.16,999

3. Realme XT (8GB + 128GB) ధర – Rs.18,999

Realme XT ప్రత్యేకతలు

Realme XT స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు ఒక 6.4-అంగుళాల Full HD + సూపర్ AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో  సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి XT  వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 16MP సోనీ   IMX471 సెన్సార్, f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.

రియల్మీ XT  గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు VOOC 3.0 ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 80 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :