చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే స్మార్ట్ ఫోన్ పేరు వినిపిస్తోంది. అది మరేదో కాదు చైనాలో విడుదల చేసిన Realme X స్మార్ట్ ఫోన్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే, కేవలం CNY 1,499 (సుమారు Rs 15,300) ధరకే ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో వుండే అనేకమైన ఫీచర్లతో ఈ Realme X స్మార్ట్ ఫోన్ను చైనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇందులో, పాప్ అప్ సెల్ఫీ కెమేరా, 48MP సోనీ IMX586 సెన్సార్ రియర్ ప్రధాన కెమేరా మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు వంటి అనూహ్యమైన విశేషాలతో కనిపిస్తోంది.
రియల్మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోనులో 6.53 అంగుళాల FHD+ శామ్సంగ్ AMOLED డిస్ప్లేను ఇందులో అందించింది. అలాగే, ఇందులో ఎటువంటి నోచ్ డిజైన్ లేకుండా పూర్తి స్క్రీన్ తో దీన్ని అందించింది. అంతేకాదు, ఈ డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB /6GB మరియు హై ఎండ్ వేరియంట్ 8GB శక్తితో పనిచేస్తుంది. అలాగే, 64GB మరియు 128GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలిజీతో కూడిన 3,750 mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ప్రధాన కెమేరాని ఒక 48MP సోనీ IMX586 సెన్సారు కి జతగా 5MP కెమేరాని కలిపి డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో అందించింది. ముందు ఒక 16MP సోనీ IMX 471 సెన్సార్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇచ్చింది. అలాగే, గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ 2.0 ని ఇందులో ఇచ్చింది. పంక్ బ్లూ మరియు స్టీమ్ వైట్ వంటి రంగులలో లభించనుంది. అధనంగా, Dolby Atmos సపోర్టును కూడా ఇందులో అందించింది.
ఇక ధర విషయానికి వస్తే, చైనాలో RealMe X యొక్క 4GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,499 (సుమారు Rs 15,300) ధరతో విడుదలయ్యింది. అలాగే, మరొక 6GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,599 (సుమారు Rs 16,300) ధరతో మరియు అత్యంత అధికమైన వేరియంట్ అయినా 8GB ర్యామ్ 128GB స్టోరేజి వేరియంట్ CNY 1,799 (సుమారు Rs 18,300) ధరతో విడుదలచేసింది.