ఇటీవల, చైనాలో గొప్ప ప్రత్యేకతలతో చాల తక్కువ ధరకు విడుదలైనటువంటి 'REALME X' స్మార్ట్ ఫోన్ను, ఇండియాలో కూడా అతిత్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్ చైనాలో విడుదల చేసినటువంటిది ధరలో కాకుండా కొంచెం ఎక్కువధరలో మరిన్ని ఫీచర్లతో తీసుకురానున్నట్లు, రియల్మీ ఇండియా CEO, అయినటువంటి మాధవ్ సేథ్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ముందుగా, ప్రకటించిన గార్లిక్ (వెల్లుల్లి) మరియు ఆనియన్ (ఉల్లిపాయ) కలర్ వేరియంట్లతో పాటుగా మరొక ఇండియన్ వేరియంట్ కూడా లాంచ్ చేయనున్నట్లు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు.
#realmeX may not necessarily launch at the same specs in India.
We are planning to have an #realmeXIndian version and
pricing maybe around 18k.Apart from Garlic and Onion,
రియల్మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోనులో 6.53 అంగుళాల FHD+ శామ్సంగ్ AMOLED డిస్ప్లేను ఇందులో అందించింది. అలాగే, ఇందులో ఎటువంటి నోచ్ డిజైన్ లేకుండా పూర్తి స్క్రీన్ తో దీన్ని అందించింది. అంతేకాదు, ఈ డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB /6GB మరియు హై ఎండ్ వేరియంట్ 8GB శక్తితో పనిచేస్తుంది. అలాగే, 64GB మరియు 128GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలిజీతో కూడిన 3,750 mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ప్రధాన కెమేరాని ఒక 48MP సోనీ IMX586 సెన్సారు కి జతగా 5MP కెమేరాని కలిపి డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో అందించింది. ముందు ఒక 16MP సోనీ IMX 471 సెన్సార్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇచ్చింది. అలాగే, గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ 2.0 ని ఇందులో ఇచ్చింది. పంక్ బ్లూ మరియు స్టీమ్ వైట్ వంటి రంగులలో లభించనుంది. అధనంగా, Dolby Atmos సపోర్టును కూడా ఇందులో అందించింది.
చైనాలో విడుదల చేసిన REALME X ధరలు
ఇక ధర విషయానికి వస్తే, చైనాలో RealMe X యొక్క 4GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,499 (సుమారు Rs 15,300) ధరతో విడుదలయ్యింది. అలాగే, మరొక 6GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,599 (సుమారు Rs 16,300) ధరతో మరియు అత్యంత అధికమైన వేరియంట్ అయినా 8GB ర్యామ్ 128GB స్టోరేజి వేరియంట్ CNY 1,799 (సుమారు Rs 18,300) ధరతో విడుదలచేసింది.
పైన తెలిపిన వివరాలు చైనాలో విడుదల చేసిన REALME X వివరాలు కాగా, ఇండియాలో విడుదల చేసేటప్పుడు వీటిలో అనేక మార్పులను చేయనున్నట్లు తెలుస్తోంది.