Realme C12, C15: అతిపెద్ద 6,000 బ్యాటరీతో విడుదలకానున్న REALME స్మార్ట్ ఫోన్లు

Updated on 13-Aug-2020
HIGHLIGHTS

Realme C12, C15 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్ధమవుతోంది

ఈ Realme C12, Realme C15 లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలను కూడా పంపింది.

Realme C12, C15 లాంచ్ ఈవెంట్ కోసం రియల్ మీ పంపించిన మీడియా ఆహ్వానం ద్వారా ఈ రెండు ఫోన్లను కూడా ఒక అతిపెద్ద 6000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు కనిపిస్తోంది.

Realme C12, C15 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్ధమవుతోంది మరియు ఇప్పటికే  ఈ లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే, మహమ్మారి కారణంగా  ఈవెంట్ కూడా వర్చువల్ లాంచ్ ఈవెంట్ అవుతుంది. ఆగస్టు 18 తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు, సంస్థ యొక్క అధికారిక యూట్యూబ్, ఫేస్ ‌బుక్ మరియు ట్విట్టర్ ‌లలో ఈ  కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది

 ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో Realme C15 గత నెలలో ఇతర మార్కెట్లలో లాంచ్ చెయ్యబడింది. అయితే, Realme C12 మాత్రం కొత్తది, దాని ఫీచర్లు గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా అతిపెద్ద 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ‌ఫోన్స్ గురించి తెలిసిన విషయాలను గురించి చర్చిద్దాం.

Realme C12, C15 లాంచ్ ఈవెంట్ కోసం రియల్ మీ పంపించిన మీడియా ఆహ్వానం ద్వారా ఈ రెండు ఫోన్లను కూడా ఒక అతిపెద్ద 6000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు కనిపిస్తోంది.  

Realme C15: ప్రత్యేకతలు

Realme C15 గత నెలలో ఆవిష్కరించబడింది, కాబట్టి ఈ స్మార్ట్ ‌ఫోన్ యొక్క ఫీచర్లు మనకు ముందే తెలుసు. ఈ రియల్ మీ సి 15 స్మార్ట్‌ ఫోన్ ఒక 6.5-అంగుళాల 29: 9 LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న వాటర్ ‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రక్షించబడింది. వెనుకవైపు, ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.

రియల్‌ మీ సి 15, MediaTek Helio G35 SoC తో పాటు జతగా 3 జిబి లేదా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 6000 ఎంఏహెచ్ మొత్తం ప్యాకేజీకి అద్భుతమైన శక్తినిస్తుంది మరియు ఇది మైక్రో యుఎస్‌బి తో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Realme C12: ప్రత్యేకతలు

రియల్‌ మీ సి 12 యొక్క ప్రత్యేకతల గురించి చాలా తక్కువగా తెలుసు. మాకు పంపిన మీడియా ఆహ్వానం నుండి, ఈ స్మార్ట్ ‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అర్ధమవుతోంది. ఇటీవలి Geekbench జాబితా 3 జిబి ర్యామ్ ‌తో పాటు Helio P35 SoC తో పనిచేస్తునట్లు ఒక స్మార్ట్ ‌ఫోన్ కనిపించింది, అది ఇదే కావచ్చు. అయితే ,కెమెరా, డిస్ప్లే మొదలైన మిగతా ఫీచర్లు మాత్రం ఇంకా గోప్యం గానే ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :