Realme P4 Pro 5G price features and specs
Realme P4 Pro 5G: రియల్ మీ P4 సిరీస్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. డిస్కౌంట్ తో ఈ ఫోన్ లభించే ధరలో సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ పవర్ ఫుల్ కెమెరా సెటప్, స్పీడ్ చిప్ సెట్ మరియు భారీ బ్యాటరీ వంటి గొప్ప డీటెయిల్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది.
రియల్ మీ పి4 ప్రో 5జి మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
రియల్ మీ పి4 ప్రో (8 జీబీ + 128 జీబీ) : ధర రూ. 24,999
రియల్ మీ పి4 ప్రో (8 జీబీ + 256 జీబీ) : ధర రూ. 26,999
రియల్ మీ పి4 ప్రో (8 జీబీ + 256 జీబీ) : ధర రూ. 28,999
ఈ రియల్ మీ కొత్త ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ ఫోన్ రియల్ మీ అధికారిక వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ బ్రిక్ ఉడ్, మిడ్ నైట్ ఐవీ మరియు డార్క్ వోక్ ఉడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ తో భారీ సింగల్ ఫస్ట్ డే ఆఫర్లు అందించింది.
ఈ ఫోన్ పై భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్ తో కొనే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 19,999 ధరకే లభిస్తుంది.
ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ తో పోలిస్తే ఈ ఫోన్ జబర్దస్త్ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ 7.68mm అల్ట్రా స్లిమ్ బాడీ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ హైపర్ గ్లో విజన్ ఫీచర్ కలిగిన 6.8 ఇంచ్ AMOLED 4D కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్,ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 4nm చిప్ సెట్ మరియు గరిష్టంగా 2.8GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 12 జీబీ ఫిజికల్ ర్యామ్, 14 జీబీ డైనమిక్ ర్యామ్ మరియు 256 జీబీ వరకు స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ రియల్ మీ UI 6.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో O రియాలిటీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి.
Also Read: Realme P4 5G: కాంపిటీటివ్ ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!
రియల్ మీ పి4 ప్రో ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 896 మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కి జతగా మూడవ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో, AI ఎడిట్ జీనీ మరియు మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఛార్జ్ ఫీచర్ కలిగి ఉంటుంది. పి4 ప్రో స్మార్ట్ ఫోన్ IP65 మరియు IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ డిజైన్ తో ఉంటుంది.