Realme P4 Power launching with powerful features
Realme P4 Power స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది. జస్ట్ రెండు వారాల క్రితం రియల్‌మీ 16 ప్రో సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసిన రియల్‌మీ, ఇప్పుడు P సిరీస్ నుంచి అప్ కమింగ్ ఫోన్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది.
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కీలక మైన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ డిజైన్ వివరాలు కూడా ఈ మైక్రో సైట్ పేజీ నుంచి రివీల్ చేసింది.
Also Read: Lava Blaze Duo 3 5G: అతి చవక ధరలో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్ చేసిన లావా.!
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో సర్వోత్తమ బ్యాటరీ కెపాసిటీ తో అందిస్తున్నట్లు రియల్‌మీ చెబుతోంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న 7000 mAh బిగ్ బ్యాటరీ కంటే మరింత పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ప్రధాన టార్గెట్ బ్యాటరీ అండ్ బ్యాక్ అప్ ఫోకస్ యూజర్లు టార్గెట్ అవుతుంది.
ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు వెనుక ప్యూర్ మాట్టే బ్యాక్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్ మరియు ట్రాన్స్ బ్లూ మూడు రంగుల్లో వస్తుంది. ఈ రియల్‌మీ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ తో పాటు ఈ ఫోన్ హైపర్ ఇమేజ్ ప్లస్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ ను కూడా రియల్ మీ లేటెస్ట్ UI 7.0 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే కాదు, ఈ ఫోన్ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ మరియు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది.