Realme P Series 5G coming soon in India
Realme P Series 5G అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కోసం రియల్ మీ ఇప్పటి నుంచే టీజింగ్ మొదలు పెట్టింది. రియల్ మీ P3 సిరీస్ నుంచి రీసెంట్ గా P3 Pro మరియు P3 Ultra వంటి ఫోన్లు విడుదల చేసిన రియల్ మీ, ఇప్పుడు ఇదే P సిరీస్ నుంచి కొత్త ఫోన్లు విడుదల చేయబోతున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. పి3 సిరీస్ నుంచి ఇండియాలో విడుదలై మంచి రేటింగ్ తెచ్చుకున్న స్మార్ట్ ఫోన్స్ తో ఈ అప్ కమింగ్ ఫోన్ ను కంపేర్ చేస్తూ టీజింగ్ మొదలుపెట్టింది.
రియల్ మీ పి సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ సిరీస్ నెంబర్ లేదా లాంచ్ డేట్ కానీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ పేరుతో టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఇది రియల్ మీ పి4 సిరీస్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్స్ పేరు లేదా లాంచ్ డేట్ ని రియల్ మీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే అంచనా వివరాలు మాత్రం ఈ టీజింగ్ పేజీ నుంచి అందించింది.
Also Read: Poco M7 Plus 5G లాంచ్ డేట్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన పోకో.!
రియల్ మీ P సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను అన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ లో పయనీర్ గా నిలబెట్టే విధంగా లాంచ్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ కొత్త మీడియాటెక్ Dimensity చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి ఈ హింట్ ను రియల్ మీ అందించింది. ఇది కాకుండా బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ ఈ ఫోన్స్ లో ఉంటుంది.
ఈ అప్ ఫోన్స్ సన్ లైట్ లో కూడా కనిపించేంత బ్రైట్నెస్ కలిగి ఉంటాయని రియల్ మీ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ చాలా స్లీక్ ఉంటుందని కూడా రియల్ మీ టీజర్ ఇమేజ్ లో చూపించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ AI కెమెరా సెటప్ కలిగి ఉంటుందని రియల్ మీ క్లియర్ గా తెలిపింది. మొత్తంగా రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లు ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతాయని రియల్ మీ చెప్పకనే చెప్పింది.