Realme Narzo Power: నార్జో సిరీస్ నుంచి 10,001mAh బ్యాటరీ వస్తోంది.!

HIGHLIGHTS

రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి 10,001 mAh బ్యాటరీ ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ నార్జో సిరీస్ లో ఫస్ట్ 10,001 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ అవుతోంది

ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకమైన టీజర్ పీజీ అందించి టీజింగ్ చేస్తోంది

Realme Narzo Power: రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి 10,001 mAh బ్యాటరీ ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ నార్జో సిరీస్ లో ఫస్ట్ 10,001 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ చూడటానికి రియల్‌మీ రీసెంట్ గా విడుదల చేసిన రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తోంది. మరి ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు డిజైన్ వివరాలు ఏమిటో చూసేద్దామా.

Realme Narzo Power: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ ను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్‌మీ డేట్ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకమైన టీజర్ పీజీ అందించి టీజింగ్ చేస్తోంది.

Realme Narzo Power: కీలక ఫీచర్స్

రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ చూడటానికి దాదాపు రియల్‌మీ పి4 పవర్ మాదిరిగానే కనిపిస్తోంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, గొప్ప విజువల్స్ కోసం హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా మీడియాటెక్ Dimensity 7400 Ultra 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50 MP ప్రైమరీ కెమెరా (Sony IMX882), 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను realme UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.

Also Read: Galaxy S26 Plus రాకతో గెలాక్సీ S25 Plus పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

ఈ ఫోన్ రెండు రోజులు బ్యాకప్ అందించే 10,001 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో ఉన్న భారీ బ్యాటరీని సైతం వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను టైటాన్ బ్లూ మరియు టైటాన్ సిల్వర్ రెండు కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :