Realme narzo 90x maroon launched in india and know the price
Realme narzo 90x స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ కూడా లాంచ్ అయ్యింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫోన్ సరికొత్త మెరూన్ కలర్ వేరియంట్ ను రియల్‌మీ విడుదల చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం మే నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, 2026 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా మెరూన్ కలర్ వేరియంట్ ను ఇప్పుడు లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకుంటుంది మరియు ఇప్పుడు కొత్త రంగుల్లో కూడా లభిస్తుంది.
రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ కొత్త మెరూన్ వేరియంట్ ను కూడా కూడా కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ను ఈ ధరలో లాంచ్ చేసింది.ముందుగా ఈ ఫోన్ నైట్రో బ్లూ మరియు ఫ్లాష్ బ్లూ రెండు రంగుల్లో మాత్రమే లభించింది. అయితే, ఇప్పుడు మెరూన్ కలర్ లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మీకు అమెజాన్ ఇండియా మరియు రియాల్ మీ అధికారిక సైట్ నుండి లభిస్తుంది.
Also Read: Vivo V70: లాంచ్ డేట్ , అంచనా ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా తను కలిగిన బిగ్ బ్యాటరీ కోసం ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కేవలం 35 నిముషాల్లోనే 50% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని పనిచేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15OS తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP Sony మెయిన్ కెమెరా కలిగిన AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI Edit Gene మరియు ఏఐ ఎడిటర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 400% అధిక వాల్యూమ్ అందించే స్టీరియో స్పీకర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 144Hz అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1570 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.