Realme Narzo 90 5G first sale starts with deals
Realme Narzo 90 5G: రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నార్జో 90 సిరీస్ స్టాండర్డ్ ఫోన్ ఫస్ట్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ కూడా ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ముందు తెలుసుకోండి.
రియల్‌మీ నార్జో 90 5జి ఫోన్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 16,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. రెండో వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) రూ. 18,499 ధరతో అందించింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ డిసెంబర్ 24వ తేదీ, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
రియల్‌మీ నార్జో 90 5జి పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ప్రకటించింది. రియల్‌మీ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్ మరియు విక్టరీ గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది.
Also Read: రూ. 20,000 సెగ్మెంట్ లో Dolby Vision అండ్ Atmos తో వచ్చే బెస్ట్ Smart Tv డీల్స్.!
ఈ రియల్‌మీ ఫోన్ 7.79mm సూపర్ స్లీక్ సైజులో కొత్త విక్టరీ పవర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 181 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ,మీడియం సైజు 6.57 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి స్క్రీన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ రియల్‌మీ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6400 MAX ప్రోసెసర్ తో అందించింది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్ జతగా 8 జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో, 50MP Sony మెయిన్ కెమెరా + 2MP మోనోక్రోమ్ రెండో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ రియల్‌మీ ఫోన్ ఎఐ ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ వంటి ఫీచర్లు మరియు మరిన్ని కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
రియల్‌మీ నార్జో 90 ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ కలిగి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ భారీ 7000 mAh టైటాన్ బ్యాటరీ, వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.