రియల్ మీ తన నార్జో 50 సిరీస్ నుండి అతితక్కువ ధరకే మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. అదే రియల్ మీ నార్జో 50i ప్రైమ్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కేవలం రూ.7,999 ధరలోనే ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్ ను ఇంత తక్కువ ధరలో విడుదల చేసినా కూడా ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా అందించడం విశేషం. రియల్ మీ యొక్క ఈ కొత్త బడ్జెట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
రియల్ మీ నార్జో 50i ప్రైమ్: ధర
రియల్ మీ నార్జో 50i ప్రైమ్ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.8,499 ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 23 న మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. Buy From Here
రియల్ మీ నార్జో 50i ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ పేరు తెలియని Unisoc ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు ARM Mali-G57 శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 4GB ర్యామ్ కూడా ఉంది.
ఈ ఫోన్ లో వెనుక కేవలం రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP AI కెమెరా వుంది. ముందు, సెల్ఫీల కోసం 5MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది.ఈ ఫోన్ 10W సాధారణ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ డార్క్ బ్లూ మరియు మింట్ గ్రీన్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile