Realme Narzo 100 Lite 5G india launch date and features revealed
Realme Narzo 100 Lite 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ అనౌన్స్ చేసింది. నిన్న మొన్నటి వరకు రియల్ మీ నార్జో 90 లైట్ ఫోన్ లాంచ్ కావచ్చని అంచనా వేస్తుండగా, రియల్ మీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నార్జో 100 లైట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక వివరాలను సైతం టీజర్ పేజీ ద్వారా రియల్ మీ రివీల్ చేసింది.
రియల్ మీ నార్జో 90 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ వివరాలు రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలక వివరాలు సైతం ఇదే పేజీ నుంచి టీజింగ్ చేసింది.
రియల్ మీ నార్జో 90 లైట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ బడ్జెట్ సిరీస్ నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూస్తుంటే మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ రియల్ మీ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 900 నిట్స్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ప్రసిద్ధి చెందిన మీడియాటెక్ బడ్జెట్ 5జి ప్రాసెసర్ Dimensity 6300 తో లాంచ్ అవుతుంది. ఇది 6nm ప్రోసెసర్ మరియు ఇది 5,60,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి తగిన ఫిజికల్ ర్యామ్ మరియు వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో జత చేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్ల సపోర్ట్ కలిగిన 13MP డ్యూయల్ AI రియర్ కెమెరా ఉంటుంది. ఇది AI స్మార్ట్ ఇమేజ్, ఏఐ ఎరేజర్ మరియు ఏఐ క్లియర్ ఫేస్ వంటి మరిన్ని ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా కూల్ చేసే పెద్ద వేపర్ ఛాంబర్ సెటప్ ను కూడా రియల్ మీ ఈ ఫోన్ లో అందించింది.
Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ బ్యాటరీ ఫీచర్ గురించి రియల్ మీ చాలా గొప్పగా టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎన్నడూ చూడని 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఇది కాకుండా ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో ఉండే బైపాస్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్టు కూడా ఈ ఫోన్లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 300% వాల్యూమ్ కలిగిన స్పీకర్ మరియు స్మార్ట్ టచ్ 2.0 వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో లాంచ్ అవుతుంది.