Realme GT 7 మరియు GT 7T రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Updated on 12-May-2025
HIGHLIGHTS

Realme GT 7 మరియు GT 7T రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది

గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేస్తున్న రియల్ మీ

లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది

గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా Realme GT 7 మరియు GT 7T రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి ముందుగా Pro వెర్షన్ ను విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్ లను కూడా విడుదల చేస్తోంది. ఈ సిరీస్ నుంచి రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది.

Realme GT 7 మరియు GT 7T : లాంచ్ డేట్

రియల్ మీ ఈ రెండు ఫోన్ లను మే 27వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది మరియు ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ లో జరుగుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.

Realme GT 7 మరియు GT 7T : ఫీచర్స్

ఈ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న రియల్ మీ జిటి 7 మరియు జిటి 7టి స్మార్ట్ ఫోన్స్ యొక్క డిజైన్ మరియు ప్రధాన ఫీచర్ ను వెల్లడించింది. వాస్తవానికి, రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ టెక్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది.

ఇక కంపెనీ అందించిన టీజర్ వివరాల ప్రకారం, జిటి 7 స్మార్ట్ ఫోన్ సరికొత్త గ్రాఫీన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఐస్ సెన్స్ బ్లూ మరియు ఐస్ సెన్స్ బ్లాక్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అయితే, రియల్ మీ జిటి 7టి స్మార్ట్ ఫోన్ ను మాత్రం మూడు కలర్ వేరియంట్స్ తో టీజింగ్ చేస్తోంది.

Also Read: లేటెస్ట్ 160W Soundbar పై అమెజాన్ జబర్దస్త్ డీల్ అందుకోండి.!

ఇక ఫీచర్స్ విషయూన్ని వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్ లో GT 7T డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు టీజర్ ఇమేజస్ ద్వారా అర్ధం అవుతుంది. అయితే, రియల్ మీ GT 7 స్మార్ట్ ఫోన్ లో మాత్రం ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్లు కూడా చాలా స్లీక్ డిజైన్ తో కనిపిస్తున్నాయి.

ఈ ఫోన్స్ లాంచ్ కంటే ముందే ఈ రెండు ఫోన్స్ కీలకమైన ఫీచర్స్ వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :