Realme 10 సిరీస్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో విడుదల

Realme 10 సిరీస్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో విడుదల
HIGHLIGHTS

రియల్మి ఎక్స్ మాస్టర్ ఎడిషన్ వంటి కొత్త టెక్షర్ బ్యాక్ ఇవ్వబడింది.

Realme తన Narzo 10 సిరీస్ ‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ చాలా కాలంగా వార్తల్లో నిలిచింది. అయితే, కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ సడలింపు తర్వాత ఈ లాంచ్ కార్యక్రమం జరిగింది.ఈ Narzo 10 మరియు Narzo 10 A సంస్థ యొక్క రియల్మి C సిరీస్ మరియు 6 సిరీస్ మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి.

రియల్మి నార్జో 10 Vs నార్జో10A ధర

రియల్మి నార్జో 10 యొక్క 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ల ధర 11,999 రూపాయలు. ఈ వేరియంట్లో మాత్రమే ఫోన్ పరిచయం చేయబడింది. నార్జో 10 ఎ ధర రూ .8,499 మరియు ఈ స్మార్ట్ ఫోన్ను 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో తీసుకువచ్చారు.

రియల్మి తన Narzo 10 అమ్మకాన్ని రియల్మీ ఇండియా స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ‌లో మే 18 న, Narzo 10 A స్మార్ట్‌ఫోన్ అమ్మకం మే 22 నుంచి ప్రారంభిస్తుంది.

Realme Narzo 10 స్పెక్స్

రియల్మి నార్జో 10 స్మార్ట్ ఫోనుకు  రియల్మి ఎక్స్ మాస్టర్ ఎడిషన్ వంటి కొత్త టెక్షర్ బ్యాక్ ఇవ్వబడింది. ఈ ఫోన్ రెండు రంగులలో వస్తుంది. ఈ ఫోన్ను ఆకుపచ్చ మరియు తెలుపు రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పాలికార్బోనేట్ కేసుతో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌ తో తీసుకురాబడింది మరియు ఇది  20: 9 యాస్పెక్ట్ రేషియాతో వుంటుంది. ఈ ఫోన్,  గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ను, గేమింగ్ ప్రత్యేకమైన ప్రోసిజర్ మీడియా టెక్ హెలియో జి 80 ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు Mali-G 52 GPU జతగా అందించింది. ఈ ఫోన్ 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది మరియు స్టోరేజ్ పెంచడానికి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అందించబడింది. నార్జో 10 ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రియల్మి UIలో పనిచేస్తుంది.

నార్జో 10 స్మార్ట్ ఫోన్,  ఒక 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కలగలిపిన క్వాడ్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఈ వెనుక కెమెరా 30 fps వద్ద 4 K UHD వీడియోను రికార్డ్ చేయగలదు మరియు దీనికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఇవ్వబడింది. వాటర్‌డ్రాప్ నోచ్ లో ఉంచిన సెల్ఫీ కెమేరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

కనెక్టివిటీ కోసం ఫోన్‌కు USB టైప్-సి పోర్ట్ ఇవ్వబడింది మరియు ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోనుకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

రియల్మి నార్జో 10A : స్పెక్స్

ఎంట్రీ లెవల్ నార్జో 10A మాట్టే ఫినిష్ తో వస్తుంది మరియు బ్లూ మరియు తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్‌ప్లే తో ఫోన్‌ను లాంచ్ చేశారు మరియు ఈ ఫోన్ను వాటర్ డ్రాప్ నోచ్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకువచ్చారు. ఈ ఫోనుకు కూడా గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది.

రియల్మి నార్జో 10A మీడియాటెక్ హెలియో జి 70 చిప్‌సెట్ తో పనిచేస్తుంది, ఇది మాలి-జి 52 గ్రాఫిక్‌ లతో జత చేసిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి,దీనిని ఒక డేడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డుతో 256 జీబీ వరకు పెంచవచ్చు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన RealmeUI లో పరికరం పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ఇది  f / 1.8 ఎపర్చరు గల 12MP ప్రాధమిక కెమెరాను మరియు మరో రెండు కెమెరాల్లో ఒక 2MP మాక్రో మరియు డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. AI బ్యూటీఫికేషన్‌తో వచ్చిన ఈ ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

నార్జో 10A 5,000WAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo