Realme GT8 Pro India launch and key features announced
Realme GT8 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేస్తూ రియల్ మీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రిలీజ్ చేసింది. కొత్త అప్డేట్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ రియల్ మీ ఫోన్స్ లో ఎన్నడూ చూడని కొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ కొత్తగా విడుదల చేసిన అప్డేట్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఈరోజు కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 టోడ్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చిప్ సెట్ గురించి కంపెనీ వివరాలు వెల్లడించింది మరియు డిస్ప్లే కోసం అదనపు చిప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో స్క్రీన్ కోసం హైపర్ విజన్ AI చిప్ ని అదనంగా అందించింది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక సరికొత్త కెమెరా మోడ్యూల్ ఉంటుంది. ఇది ఈ ఫోన్ లుక్ ని పూర్తిగా మార్చేస్తుంది.
జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఇక టెలిస్కోప్ కెమెరా మరియు మరో రెండు కెమెరాలు ఉంటాయి. ప్రముఖ కాంపాక్ట్ డిజిటల్ కెమెరా కీ ప్లేయర్ RICOH GR కో ఇంజనీరింగ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా అందించినట్లు రియల్ మీ తెలిపింది. ఈ కెమెరా ఫీచర్ ఈ ఫోన్ ను ఇతర ఫోన్స్ తో పోటీ లేనిదిగా చేస్తుంది. ఇందులో కెమెరా సెటప్ పెద్ద సౌండ్ బంప్ లో ఉంటుంది.
Also Read: Lava Agni 4: మెటల్ ఫ్రెమ్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తోంది.!
రియల్ మీ GT8 ప్రో స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు కూడా రియల్ మీ త్వరలోనే అనౌన్స్ చేస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని రియల్ మీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది.