రూ.3000 భారీ డిస్కౌంట్ అఫర్ తో Realme GT ఫస్ట్ సేల్

Updated on 25-Aug-2021
HIGHLIGHTS

Realme లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme GT

భారీ డిస్కౌంట్ రియల్‌మీ జిటి 5G తో ఫస్ట్ సేల్

Realme ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Realme GT యొక్క ఫస్ట్ సేల్ ఈరోజు మద్యహ్నం మొదలవుతుంది. అయితే, ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనుగోలుచేసే  కస్టమర్లకు 3000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అఫర్ realme.com మరియు flipkart నుండి కొనుగోలుచేసే ICICI బ్యాంక్ కస్టమర్లకు వర్తిస్తుంది. అంతేకాదు, మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించింది. Check Offers Here         

రియల్‌మీ జిటి 5G: ప్రైస్

రియల్‌మీ జిటి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ.37,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రారంభమవుతుంది. రియల్‌మీ జిటి మొదటి సేల్ ఆగష్టు 25 నుండి మొదలవుతుండగా, రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్ మాత్రం ఆగష్టు 26 నుండి అమ్మకానికి వస్తుంది.

రియల్‌మీ జిటి 5G: స్పెక్స్

రియల్‌మీ జిటి స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G SoC ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ కూడా ఉంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ లో 64MP SonyIMX682 సెన్సార్ ని ప్రధాన కెమెరాగా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన                                          Android 11 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :