Realme GT 6T: స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 తో ఇండియా లాంచ్ కన్ఫర్మ్.!

Updated on 09-May-2024
HIGHLIGHTS

GT సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అనౌన్స్ చేయబడింది

Realme GT 6T ను స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది

1.5M+ AnTuTu Score తో టాప్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది.

Realme GT 6T: రియల్ మీ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన GT సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అనౌన్స్ చేయబడింది. అదే, రియల్ మీ GT 6T 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 తో లాంచ్ చేసినట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించని కంపెనీ, ఈ ఫోన్ టాప్ ఫీచర్లతో టీజింగ్ చేస్తోంది.

Realme GT 6T Launch

రియల్ మీ GT 6T 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు అందించలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Amazon Special గా తీసుకు వస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం అమెజాన్ సైట్ నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించింది మరియు టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని వివరాలతో టీజింగ్ చేస్తోంది. అందులో మొదటిది ఈ ఫోన్ యొక్క ప్రోసెసర్. రియల్ మీ GT 6T 5జి స్మార్ట్ ఫోన్ ను క్వాల్కామ్ సరికొత్త వేగవంతమైన ప్రోసెసర్, Snapdragon 7+ Gen 3 తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదల కానున్న మొదటి ఫోన్ ఇదే అని కూడా రియల్ మీ తెలిపింది.

Realme GT 6T

Snapdragon 7+ Gen 3 ప్రోసెసర్ యొక్క ప్రత్యేకత లతో టీజింగ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ 1.5M+ AnTuTu Score తో టాప్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా రియల్ మీ ఈ టీజర్ నుండి తెలిపింది.

Also Read: Flipkart Sale చివరి రోజు ఈ 50 ఇంచ్ బిగ్ Smart Tv పై భారీ డిస్కౌంట్ అందించింది.!

ప్రోసెసర్ వివరాలతో పాటు మరో రెండు వివరాలతో కూడా ఊరిస్తోంది. అవేమిటంటే, ఈ ఫోన్ లో అందించే బ్యాటరీ మరియు వేపర్ కూలింగ్ ఛాంబర్. అందుకే, ఈ ఫోన్ ను గేమింగ్ మరియు పెర్ఫార్మెన్స్ బీస్ట్ గా తీసుకువస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ Curved డిస్ప్లే, పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాని కల్గి ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :