రూ.10,000 లోపే 5G స్మార్ట్ ఫోన్: రియల్‌మీ సంచలన నిర్ణయం

Updated on 14-Jul-2021
HIGHLIGHTS

రియల్‌మీ సంచలన ప్రకటన

చౌకైన 5G స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సంచలన ప్రకటన చేసింది. ప్రీమియం సెగ్మెంట్ నుండి బడ్జెట్ సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరిలో కూడా స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టిన రియల్‌మీ 2022 నాటికి చౌకైన 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రియల్‌మీ సీఈవో మాధవ్ సేథ్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి సమాచారాన్ని షేర్ చేశారు.  

రూ.10,000 కంటే తక్కువ ధరకే రియల్‌మీ 5G ఫోన్లు ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ చూస్తోంది. అలాగే, ఫ్యూచర్ లో రూ. 15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరలో రాబోయే అన్ని రియల్‌మీ స్మార్ట్ ఫోన్లు కూడా 5G కనక్టివిటీతో వస్తాయనే ఒక పెద్ద న్యూస్ కూడా తెలిసింది. అంతేకాదు, 2022 త్రైమాసికంలో రియల్‌మీ జిటి ని ఇండియాలో విడుదల చేయడానికి రియల్‌మీ సంస్థ సన్నద్ధమవుతోందని కూడా మాధవ్ సేథ్ తెలిపారు.

రియల్‌మీ త్వరలోనే 5G సపోర్ట్ తో రియల్‌మీ జిటి సిరీస్ ను ప్రవేశపెట్టనుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా రియల్‌మీ 5G టెక్నాలజీతో మరిన్ని ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనుంది. వెబ్ నార్ ద్వారా మాధవ్ సేథ్ తెలిపిన ప్రకారం, రియల్‌మీ నార్జో సిరీస్ లో 5G మరింతగా విస్తరించాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. అంతేకాదు, ఈ ఏడాది పలు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కూడా మాధవ్ సేథ్ ఈ వెబ్ నార్ నుండి తెలిపారు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :