Realme Concept teased with 15000 mAh big battery
15000 mAh హెవీ బ్యాటరీతో Realme Concept ఫోన్ ప్రకటించింది. ఇప్పటికే వరుస పెట్టి కొత్త ఫోన్లు అందిస్తున్న రియల్ ఇప్పుడు మరో కొత్త ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ గురించి చాలాకాలంగా రూమర్లు కొనసాగుతున్నా, ఇప్పుడు రియల్ మీ ఈ ప్రోటోటైప్ ఫోన్ ని రివీల్ చేసింది. ఈ ఫోన్ కొత్త కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ గురించి రియల్ మీ చెబుతున్న కొత్త ముచ్చట్లు ఏమిటో చూద్దామా.
రియల్ మీ గ్లోబల్ అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ముందుగా టీజర్ ఇమేజ్ రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ పోస్ట్ లో రెండు కొత్త ఫోన్స్ గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్ లో రెండు ఫోన్లు అందించింది వీటిలో ఏది మీకు ఇష్టమైన ఉంటుందో చెప్పండి, అంటూ ట్వీట్ చేసింది. ఇందులో 15000 mAh బిగ్ బ్యాటరీ కాన్సెప్ట్ ఫోన్ మరియు ఇన్ బిల్ట్ ఫ్యాన్ కలిగిన చిల్ ఫ్యాన్ ఫోన్ అందించింది.
అయితే, ఈరోజు రియల్ మీ నిర్వహించిన realme 828 Fan Festival నుంచి ఈ రెండు కాన్సెప్ట్ ఫోన్స్ ను రివీల్ చేసింది. ఇందులో, బిగ్ బ్యాటరీ మరియు చిల్ బ్యాటరీ ఫోన్ ఇమేజ్ లో ఉన్నట్లు కనిపించాయి. ఇందులో ఈ బిగ్ బ్యాటరీ ఫోన్ కేవలం 8.89mm మందంతో మాత్రమే ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
ఒక 15000 mAh పవర్ బ్యాంక్ తో పోలిస్తే ఇది 42% సన్నగా ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఇది 50 గంటల వీడియో ప్లే అందిస్తుందని మరియు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఫోన్ గా ఇది ఉంటుందని కూడా రియల్ ని ప్రకటించింది. ఈ బిగ్ బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే శక్తివంతమైన ఛార్జ్ సపోర్ట్ కూడా కావాలి. అందుకే, కొత్త 320W ఛార్జ్ సపోర్ట్ గురించి కూడా ఈ ఈవెంట్ నుంచి ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ లాంచ్, ప్రైస్ మరియు ఇతర వివరాలు ఇంకా అందించలేదు.
Also Read: boAt 5.1 Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 9 వేల ధరలో లభిస్తుంది.!
కూల్ ఫ్యాన్ ఫోన్ గురించి కూడా కంపెనీ ఈరోజు వివరాలు అందించింది. ఫోన్ లో బిల్ట్ ఇన్ హెవీ ఫ్యాన్ కలిగిన కొత్త కూల్ ఫ్యాన్ గురించి రియల్ మీ ఈ ఈవెంట్ నుంచి ప్రస్తావించింది. ఇందులో ఎడమవైపు క్రింద భాగంలో ఫ్యాన్ ఉన్నట్లు చూపించింది. ఈ ఫ్యాన్ తో ఫోన్ చాలా వేగంగా కూల్ అవుతుంది.
అయితే, ఈ రెండు ఫోన్లు కూడా గ్లోబల్ ఈవెంట్ నుంచి రివీల్ చేసింది. అంటే, ఈ ఫోన్లు ఇండియాలో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ కాన్సెప్ట్ ఫోన్స్ ఇతర వివరాల గురించి కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు.