Realme C83 5G: అతి భారీ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ

HIGHLIGHTS

రియల్‌మీ బడ్జెట్ సిరీస్ అయిన C Series నుంచి అప్ కమింగ్ ఫోన్ రిలీజ్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది

Realme C83 5G టీజర్ లో భాగంగా రివీల్ చేసిన కీలక ఫీచర్లు ఈ ఫోన్ పై అంచనాలు పెంచడానికి కారణం అయ్యాయి

ఈ ఫోన్ 7000mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది

Realme C83 5G: రియల్‌మీ బడ్జెట్ సిరీస్ అయిన C Series నుంచి అప్ కమింగ్ ఫోన్ రిలీజ్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ C83 మరియు ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ టీజర్ లో భాగంగా రివీల్ చేసిన కీలక ఫీచర్లు ఈ ఫోన్ పై అంచనాలు పెంచడానికి కారణం అయ్యాయి.

Realme C83 5G: లాంచ్ డేట్

రియల్‌మీ సి3 స్మార్ట్ ఫోన్ ను మార్చి 7వ తేదీ మధ్యాహ్నం గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రియల్‌మీ అందించిన టీజర్ పేజీ నుండి ఈ వివరాలు అందించింది. అంతేకాదు, ఇదే టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ లాంగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు క్లియర్ అవుతుంది.

Realme C83 5G: ఫీచర్స్

రియల్‌మీ సి3 స్మార్ట్ ఫోన్ ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14000 కంటే పైచిలుకు మైక్రో డ్రాప్ టెస్ట్ తట్టుకున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీ ఫీచర్స్ గురించి కంపెనీ ఎక్కువగా చెబుతోంది. ఈ ఫోన్ 7000mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6 సంవత్సరాల వరకు మంచి బ్యాటరీ లైఫ్ అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్, పవర్ ను జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎక్కువ సమయం బ్యాటరీని నిలబెట్టే Ai పవర్ సేవింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ మరియు AI పవర్ సేవింగ్ వంటి ఫీచర్ మాత్రమే కాదు ఈ ఫోన్ లో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో ఉండే బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూమింగ్ పర్పల్ మరియు స్ప్రౌటింగ్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :