Realme C67 5G: బడ్జెట్ ధరలో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వచ్చింది.!

HIGHLIGHTS

రియల్ మీ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యబడింది

Realme C67 5G కేవలం బడ్జెట్ ధరలో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వచ్చింది

ఈ ఫోన్ లో కూడా రియల్ మి యొక్క 'Mini Capsule' ఫ్యూచర్ ను జత చేసింది

రియల్ మీ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యబడింది. Realme C67 5G పేరుతో రియల్ మి సి సిరీస్ నుండి వచ్చిన ఈ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో కూడా రియల్ మి యొక్క ‘Mini Capsule’ ఫ్యూచర్ ను జత చేసింది మరియు మరిన్ని ఆకర్షణీయమైన వివరాలను కూడా ఈ ఫోన్ కలిగి వుంది. రియల్ మి సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

Realme C67 5G Price

రియల్ మి సి67 5జి ప్రైస్ & ఆఫర్లు

రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 13,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రారంభ వేరియంట్ 4 GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 14,999. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు Flipkart నుండి ఫస్ట్ సేల్ మొదలవుతుంది.

రియల్ మి సి67 5జి ఆఫర్లు

ఈ ఫోన్ తో లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI,HDFC మరియు SBI కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,500 వరకూ డిస్కౌంట్ అందుకునే అవకాశం రియల్ మి అందించింది.

Also Read : Yuva 3 Pro: 9వేల లోపలే 8GB ర్యామ్, 50MP కెమేరాతో వచ్చింది.!

రియల్ మి సి67 5జి స్పెక్స్ & ఫీచర్స్

రియల్ మి సి67 5జి స్పెక్స్ & ఫీచర్స్

రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ఫాస్ట్ మీడియాటెక్ ప్రోసెసర్ Dimensity 6100+తో తీసుకు వచ్చింది. ఇది Android 13 OS పైన realme UI 4.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ Sunny Oasis మరియు Dark Purple అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. IP54 Water Resistance సపోర్ట్ తో ఈ ఫోన్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి తుంపర్లు మరియు జల్లుల నుండి రక్షణ కలిగి వుంది.

రియల్ మి సి67 5జి కెమేరా

రియల్ మి సి67 5జి ఫోన్ పెద్ద 6.72 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 680nits పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ రియల్ మి కొత్త ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాని, 8MP AI సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ 6GB వరకూ ర్యామ్ మరియు 6GB వరకూ డైనమిక్ RAM ఫీచర్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :