Realme C33: అతితక్కువ ధరలో 50MP కెమేరాతో వచ్చింది.!

HIGHLIGHTS

Realme మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్లతో ఆవిష్కరించింది

అదే Realme C33 బడ్జెట్ స్మార్ట్ ఫోన్

పెద్ద కెమెరా మరియు పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు

Realme C33: అతితక్కువ ధరలో 50MP కెమేరాతో వచ్చింది.!

Realme తన బడ్జెట్ సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్లతో ఆవిష్కరించింది. అదే Realme C33 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో పెద్ద కెమెరా మరియు పెద్ద బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక పెద్ద మరియు ఆకర్షణీయమైన కెమెరా డిజైన్ ను కూడా కలిగివుంది. మరి ఈరోజే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C33: ధర

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ ను 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.8,999 ధరతో ప్రకటించింది. అలాగే, 4GB ర్యామ్ మరియు 64 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఈ ఫోన్ సెప్టెంబర్ 12 న మొదటిసారిగా సేల్ కి అంధుబాటులో ఉంటుంది.

Realme C33: స్పెక్స్

రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ ని 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సి మరియు శాండీ గోల్డ్ అనే మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

కెమెరాల పరంగా, రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 50MP+0.3MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo