Realme C30s: బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లేతో రూ.7 వేల సెగ్మెంట్ లో లాంచ్.!

HIGHLIGHTS

రియల్ మీ మరొక తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది

Realme ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద డిస్ప్లే మరియు పెద్ద బ్యాటరీతో అందించింది

Realme C30s స్మార్ట్ ఫోన్ ను లో బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది

Realme C30s: బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లేతో రూ.7 వేల సెగ్మెంట్ లో లాంచ్.!

రియల్ మీ మరొక తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద డిస్ప్లే మరియు పెద్ద బ్యాటరీతో అందించింది. అదే, Realme C30s స్మార్ట్ ఫోన్ మరియు రియల్ మీ ఈ ఫోన్ ను లో బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ పెద్ద 5,000mAh బ్యాటరీతో ఈరోజు మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఫోన్ ను కేవలం 7,499 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది. రియల్ మీ యొక్క ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C30s: ధర

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 2GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.7,499 ధరతో ప్రకటించింది. అలాగే, 4GB ర్యామ్ మరియు 64 స్టోరేజ్ వేరియంట్  ధర రూ.8,999. ఈ ఫోన్ జూన్ 27 న మొదటిసారిగా అమ్మకాలకు అంధుబాటులో ఉంటుంది.

Realme C30s: ప్రత్యేకతలు

రియల్ మీ C30s స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ARM Cortex-55 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ స్ట్రైప్ బ్లూ మరియు స్ట్రైప్ బ్లాక్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ C30s స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా realme UI Go Edition సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo