రియల్మీ C2 : బడ్జెట్ వినియోగదారులకి ఒక భారీ బహుమతి

Updated on 23-Apr-2019
HIGHLIGHTS

కేవలం రూ.5,999 ధరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి, రియల్మీ C2 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది

రియల్మీ C2 (2GB ర్యామ్ + 16GB స్టోరేజి) - Rs 5,999

రియల్మీ C2 (3GB ర్యామ్ + 32GB స్టోరేజి) - Rs 7,999

రియల్మీ ఇప్పుడు చాల వేగంగా తన మార్కెట్ను విస్తరించండి షూటునట్లు కనిపిస్తోంది. ఎందుకంటే,  కేవలం రూ.5,999 ధరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి,  రియల్మీ C2 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వాస్తవానికి, ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండానే, ఈ రియల్మీ C2 ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమేరా మరియు మంచి ప్రాసెసర్ తో పాటుగా చాల అతక్కువ ధరకే తీసుకురావడంతో, ఇది మార్కెట్లో ఈ ధర పరిధిలో వున్నా మిగిలిన ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.         

REALME C2 ధర మరియు ఆఫర్లు

రియల్మీ C2 (2GB ర్యామ్ + 16GB స్టోరేజి) – Rs 5,999

రియల్మీ C2 (3GB ర్యామ్ + 32GB స్టోరేజి) – Rs 7,999

రియల్మీ C2 యొక్క మొదటి సేల్ మే నెల 15వ తేదీన ఫ్లిప్ కార్ట్, రియల్మీ మరియు రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను జియో తో పాటుగా ఎంచుకునేవారికి  5300 రూపాయల విలువగల లాభాలను అందుకోవచ్చు.                              

రియల్మీ C2 ప్రత్యేకతలు

రియల్మీ C2  స్మార్ట్ ఫోన్, ఒక 6.1 అంగుళాల HD డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 89%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.               

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP కెమేరాకు జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 5MP  సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీనితో వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :